Husband And Wife: భార్యభర్తల బంధం చాలా ధృఢమైనది. ఎందుకంటే ఒక వ్యక్తికి తల్లిదండ్రులు 20 సంవత్సరాలు తోడుంటే.. ఆ తరువాత జీవితాంతం కలిసి ఉండేది భార్యలేదా భర్త మాత్రమే. పెళ్లి కాకముందు ఉండే జీవితం కన్నా.. పెళ్లయిన తరువాత సాగే జీవితం ఎంతో ముఖ్యమైనది. ఈ కాలంలోనే ఒక వ్యక్తి అన్ని విషయాలను గ్రహిస్తాడు. ఈ సమయంలోనే కష్ట, సుఖాలు ఎక్కువగా అనుభవిస్తాడు. పెళ్లయిన తరువాత భర్త కంటే భార్య గొప్పదా? లేక భర్త ఎక్కువనా? అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఈ విషయంలో కొన్ని గొడవలు కూడా జరిగాయి. అయితే చాలా మంది పురుషులు పెళ్లయ్యాక తప్పక పెళ్లాం మాట వినాల్సి వస్తుంది. అంతేకాకుండా అప్పటి వరకు హీరోగా ఉన్న వ్యక్తి ఆ తరువాత జీరోగా మారుతారు. అందుకు ఇవే కారణాలు..
ఇంట్లో ఆమెదే పైచేయి..
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.. కానీ చాలా మంది పురుషులు బయట పులిలా ఉన్నా ఇంట్లోకి వచ్చే సరికి పిల్లిలా మారుతారు. ముఖ్యంగా పెళ్లయిన తరువాత చాలా మంది పెళ్లాం మాట వినకుండా ఏ పని చేయడానికి ముందుకు సాగరు. అందుకు కారణం ఇంట్లో ఆడవాళ్లదే పైచేయిగా ఉంటుంది. బయటి పనులు ఎన్ని చేసిన ఇంట్లో కొన్ని విషయాలను మగవాళ్లు పట్టించుకోరు. కొన్ని పనులు భార్యలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు చాలా మంది మగవాళ్లకు వంట చేయడం అస్సలు రాదు. ఇతర విషయాల్లో వారితో గొడవ పడితే వారి పగను అక్కడ చూస్తారనే భయంతో వారితో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఉంటారు.
ప్రేమ తగ్గుతుందనే భయం..
రోజంతా ఎంతో కష్టపడిన మగవాళ్లు ఇంట్లోకి వచ్చిన తరువాత రిలాక్స్ అవుదామని అనుకుంటారు. అందుకు భార్యతో కబుర్లు చెప్పుకుంటే వారితో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే వారితో ప్రేమగా ఉంటేనే వారు ప్రేమను పంచుతారు. భార్య వద్ద దొరికే ప్రేమ మరెక్కడా లభించదని కొందరి భావన. ఆ ప్రేమను మిస్ కాకుండా ఉండేందుకు వారితో సంయమనంతో ఉంటారు. ఈ క్రమంలో వారు చెప్పిన ప్రతీ పని చేస్తారు.
విలువైన సలహాలు..
కొన్ని బయటి పనుల్లో ఆడవాళ్లు విలువైన సలహాలు ఇస్తుంటారు. ఒక్కోసారి మగవాళ్ల ఆలోచనలకంటే ఆడవారి ఆలోచనలు సక్సెస్ అవుతుంటాయి. ఈ విషయాన్ని గ్రహించిన మగవాళ్లు చాలా విషయాల్లో వారి సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారికి వాల్యూ ఇస్తూ వారికి కావాల్సింది ఇస్తుంటారు. అయితే ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో కొందరు మగవాళ్లు చాకచక్యంగా ప్రవర్తిస్తూ వారిని అదుపులో పెట్టుకునే అవకాశం కూడా ఉంది.
పిల్లల విషయంలో..
పిల్లల పెంపకం విషయంలో ఆడవాళ్లదే పైచేయి ఉంటుంది. మగవాళ్లు బయట పనులకు వెళ్లినప్పుడు ఇంట్లోని వ్యవహారాలను ఆడవాళ్లు చూసుకుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఏం కావాలో తల్లి మాత్రమే ఎక్కువగా గ్రహిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి వారితో గొడవలకు దిగకుండా సక్రమంగా నడుచుకుంటారు. దీంతో ఆడవాళ్లను ప్రేమగా చూస్తూ వారు చెప్పిందల్లా చేస్తారు.