Doctors : ఆపరేషన్ చేస్తున్నప్పుడు వైద్యులు ఆకుపచ్చ డ్రెస్ లు ఎందుకు వేసుకుంటారు?

కానీ 1914లో ఒక వైద్యుడు ఆకుపచ్చ బట్టలు వేసుకొని వచ్చాడు. అప్పటి నుంచి ఈ డ్రెస్ కోడ్ ట్రెండ్‌ అయింది. ఈ రోజుల్లో కొందరు వైద్యులు కూడా నీలం రంగు దుస్తులు ధరించడం చూసే ఉంటారు.

Written By: NARESH, Updated On : October 20, 2024 10:11 pm

Why do Doctors wear green dresses while operating

Follow us on

Doctors : ప్రతి ఒక్కరు ఏదో ఒక రీజన్ తో కనీసం ఒక్కసారైనా ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఆపరేషన్ కి ముందు డాక్టర్ ఆకుపచ్చ క్లాత్ ధరించడం కూడా చూశారు కదా. హాస్పిటల్(Hospital) లో కాకపోయినా సినిమాల్లో అయినా డాక్టర్లు ఆకుపచ్చ డ్రెస్ వేసుకోవడం చూసే ఉంటారు. అయితే కొన్నిసార్లు డాక్టర్లు ఆపరేషన్ సమయంలో నీలిరంగు డ్రెస్ ను కూడా ధరిస్తారు, కానీ ఎరుపు-పసుపు దుస్తులలో సర్జరీ(Surgery) చేయడం ఎవరు చూసి కూడా ఉండరు. ఇంతకీ ఏ డాక్టర్ ను చూసినా సరే ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఎందుకు ఆపరేషన్ చేస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే దీనికి సమాధానం ఈ రోజు తెలుసుకుందాం.

ఆపరేషన్ చేసే టైంలో డాక్టర్లు పూర్తి దృష్టి కేంద్రీకరించడం చాలా అవసరం. అయితే గ్రీన్ కలర్ డాక్టర్ల దృష్టి, మానసిక ప్రశాంతత, పనితీరును మెరుగుపరుస్తుంది. ఆపరేషన్ లో డాక్టర్ల కళ్లు మొత్తం ఎర్రని రక్తంపైనే కేంద్రీకృతం అవుతాయి. అంటే ఈ ఆకుపచ్చ రంగు వారి కళ్లకు ఉపశమనం కలిగించేలా చేస్తుంది. ఆపరేషన్ టైంలో గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకుంటే రక్తం ఎరుపు, గ్రీన్ కలర్ ల కాంట్రాస్ట్ బాగా కనిపిస్తుంది. దీనివల్ల డాక్టర్లు చిన్న నరాలు, కణాలను బాగా గుర్తించగలుగుతారట.

రెడ్ కలర్ ను చూస్తే వైద్యుల కళ్లలో ఎర్రని మచ్చలు కనిపిస్తాయి. గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకోవడం వల్ల ఈ ప్రభావం ఉండదు. గ్రీన్ కలర్ మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఆపరేషన్ టైంలో ఈ రంగు సర్జన్‌ ను ప్రశాంతంగా, దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. ఆకుపచ్చ రంగు మెదడుకు విశ్రాంతిని అందించడంలో సహాయం చేస్తుంది. ఆపరేషన్ టైంలో డాక్టర్లు ఎక్కువసేపు దృష్టి కేంద్రీకరించడానికి ఈ కలర్ సహాయపడుతుంది. ఆకుపచ్చ, నీలిరంగు డ్రెస్ లు ఆపరేషన్ టైంలో పరిశుభ్రతకు చిహ్నంగా వేసుకుంటారు. ఇది పేషెంట్, సిబ్బంది మధ్య నమ్మకాన్ని కలిగిస్తుంది.

ఆపరేషన్ థియేటర్‌లో వెలుతురు ఎక్కువగా ఉంటుంది. తెల్లని దుస్తులు ధరిస్తే దాని వల్ల కళ్లపై వెలుతురు ప్రభావం చూపుతుంది. ఆకుపచ్చ రంగు ఈ కాంతి ప్రభావాన్ని తగ్గించేలా చేస్తుంది. ఆపరేషన్ టైంలో ఆకుపచ్చని డ్రెస్ ను వేసుకుంటే ఆపరేషన్ బృంద సభ్యులు ఒకరి సంజ్ఞలను ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. సో సమన్వయం పెరుగుతుంది.

మొదటి సర్జన్ సుశ్రుతుడు:
ఇటీవలే, టుడేస్ సర్జికల్ నర్సు 1998 సంచికలో కూడా ఒక నివేదిక వచ్చింది. దీని ప్రకారం, శస్త్రచికిత్స సమయంలో ఆకుపచ్చ దుస్తులు కళ్ళకు విశ్రాంతిని ఇస్తుందని.. ఢిల్లీలోని BLK సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓంకో సర్జన్ డాక్టర్ దీపక్ నైన్ తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్‌ సుశ్రుత, ఆయుర్వేదంలో శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు కూడా ఆకుపచ్చ రంగును ఉపయోగించారట. కానీ దీనికి నిర్దిష్ట కారణం లేదన్నారు. చాలా చోట్ల, సర్జన్లు శస్త్రచికిత్స సమయంలో నీలం, ఆకుపచ్చుతో పాటు కొన్ని సార్లు తెలుపు దుస్తులను కూడా ధరిస్తారు. కానీ ఆకుపచ్చ రంగు మంచిది ఎందుకంటే దానిపై రక్తపు మచ్చలు కనిపించవు. ముఖ్యంగా అవి గోధుమ రంగులో కనిపిస్తాయి.

వైద్యులు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులు ధరించడం ముందు నుంచి లేదు. ఇంతకుముందు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అందరూ తెల్లని బట్టలు ధరించేవారు. కానీ 1914లో ఒక వైద్యుడు ఆకుపచ్చ బట్టలు వేసుకొని వచ్చాడు. అప్పటి నుంచి ఈ డ్రెస్ కోడ్ ట్రెండ్‌ అయింది. ఈ రోజుల్లో కొందరు వైద్యులు కూడా నీలం రంగు దుస్తులు ధరించడం చూసే ఉంటారు.