earthworms : వానపాముల గురించి ఈ సీక్రెట్స్ మీకు తెలుసా?

వానపాములు జీవిత కాలం 8 సంవత్సరాలు. అయితే అంతకంటే ఎక్కువ కాలం ఉండగలవు. కానీ పక్షులు, కప్పలు దృష్టిలో ఇవి పడితే వాటికి ఆహారంగా మారుతాయి.

Written By: NARESH, Updated On : October 20, 2024 9:56 pm

Do you know these secrets about earthworms

Follow us on

earthworms : మానవులతో ప్రకృతి మమేకమై ఉంటుంది. కొన్ని జీవులు మానవులకు హాని కలిగించినా.. మరికొన్ని చేసే మేలు అంతా ఇంతా కాదు. సహజ సిద్ధంగా ఏర్పడి కొన్ని కీటకాలు, పురుగులు ముఖ్యంగా వ్యవసాయ పంటలకు చాలా ఉపయోగపడుతాయి. ఉదాహరణకు పామును చూస్తే అందరికీ భయమే. కానీ ఇవి రైతులకు మేలు చేస్తాయి. పొలాల్లో ఉండే ఎలుకలను ఇవి తింటూ పంటపొలాలకు రంధ్రాలు చేయకుండా అడ్డుకుంటాయి. అలాగే వానపాముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో ఎక్కడ చూసినా వానపాములు కుప్పులు కుప్పలుగా కనిపిస్తాయి. వీటిని చూస్తూ వదిలేస్తాం. కానీ వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న విషయం తెలుసా? అవేంటంటే?

వానపాములను ప్రకృతి ఇంజనీర్లు అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి రైతులకు ఎంతో మేలు చేస్తాయి పంట పొలాల్లోని మట్టిని కదిలిస్తూ ఉంటాయి. అలాగే నేలకు గాలిని అందించడానికి ఇవి ఎక్కువగా మట్టిలోనే కలిసిపోతాయి. పంటపొలాలు, తోటలు ఆరోగ్యంగా ఉండడానికి వానపాములు ఎంతో సహకరిస్తాయి. అయితే వానపాముల గురించి ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించరు. కానీ వీటి జీవన విధానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

వానపాములను కోయడం వల్ల మరికొన్ని ఉత్పత్తి అవుతాయని కొందరు అంటుంటారు. కానీ ఇవి శరీరంలోని ఏ భాగం నుండైనా మరికొన్ని వానపాములను ఉత్పత్తి చేస్తాయి. వీటికి ఒక తోక మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఊపరితిత్తులు ఉండవు. దీంతో అవి చర్మం ద్వారా గాలిని పీల్చుకుంటాయి. అయితే చర్మం ఎప్పుడు తేమగా ఉంటేనే అవి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమవుతుంది. తేమ లేనప్పుడు అవి శ్వాస తీసుకోలేవు. అందువల్ల ఇవి ఎక్కువగా వర్ష కాలంలో కనిపిస్తూ ఉంటాయి. వాన పాములకు మిగతా అవయవాలు అంటూ ఉండవు. అందువల్ల అవి చర్మం ద్వారానే కాంతి, వెలుగును గ్రహించగలవు.

పంటపొలాలకు వానపాములు సహకరిస్తాయి. ఒక ఎకరంలో లక్షల కొద్దీ వానపాములు ఉంటాయి. ఇవి మట్టి నాణ్యతను ఉంచడానికి సహకరిస్తాయి. అలాగే ఇవి ఉన్న చోట ఎక్కువగా మట్టి పేరుకుపోతూ ఉంటుంది. దీంతో ఎరువును గ్రహించి పంటలకు జీవం పోస్తుంది. వానపాములు నేల సంపీడనానికి కారణమవుతుంది. వీటికి ఐదు హృదయాలు ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా వానపాములు 6 వేల జాతులను గుర్తించారు. వీటిలో ఎక్కువగా అమెరికా, కెనడాలో కనిపిస్తాయి. ఇక్కడ ఉండేవి సమృద్ధిగా వ్యాప్తి చెందుతాయి. వానపాములు పెట్టిన గుడ్ల నుంచి పిల్ల వానపాములు ఏడు రోజుల తరువాత బయటకు వస్తాయి. పూర్తి దశ కు చేరుకోవడానికి ఏడాది సమయం పడుతుంది. కొన్ని పొడవుగా..మరికొన్ని చిన్నగా కనిపిస్తాయి.

వానపాములు జీవిత కాలం 8 సంవత్సరాలు. అయితే అంతకంటే ఎక్కువ కాలం ఉండగలవు. కానీ పక్షులు, కప్పలు దృష్టిలో ఇవి పడితే వాటికి ఆహారంగా మారుతాయి. అయితే మొక్కలకు మాత్రం ఇవి బలాన్ని ఇచ్చే విధంగా తోడ్పడుతాయి. ఇవి మట్టిని సమర్థ వంతంగా ఉంచుతూ మొక్క ఆరోగ్యంగా పెరిగే లా చూస్తాయి. అందువల్ల చాలా మంది వాన పాములను వెతికి మరీ పట్టుకొని తమ ఇంట్లో పెంచుకునే మొక్కలకు ఎరువుగా వేస్తారు.