Child Behavior : మొబైల్ విప్లవం వచ్చిన తరువాత ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ముఖ్యంగా పెద్దవాళ్ల చేతిలో కంటే చిన్న పిల్లలు ఎక్కువగా మొబైల్స్ తో కనిపిస్తున్నారు. అన్నం తినిపించే అవసరం నుంచి గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్స్ ను తప్పనిసరిగా వాడుతున్నారు. అయితే తాత్కాలికంగా పిల్లల ఆనందం కోసం మొబైల్స్ ను యూజ్ చేస్తున్నా.. దీర్ఘ కాలికంగా ఇది నష్టాలను తెస్తుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఫోన్ స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల వారి కళ్లపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే తాజాగా యునైటేడ్ స్టేట్స్ లో నిర్వహించిన ఓ పరిశోధన షాకింగ్ తెస్తుంది. పిల్లలు ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల ఈ సమస్య కూడా వస్తుందని తేలింది. అదేంటంటే?
ప్రస్తుతం ఫోన్ వాడని వారు అంటూ ఎవరూ లేరు. వాస్తవానికి స్మార్ట్ ఫోన్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏ పని చేయాలన్నా.. ఎటువంటి సమాచారం కావాలన్నా ఫోన్ ద్వారా ఈజీ అవుతుంది. కానీ కొందరు అనవసరపు కాలక్షేపానికి కూడా స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు. సినిమాలు, గేమ్స్ మొబైల్ లోనే ఎక్కువగా చూస్తున్నారు. దీంతో అవసరం ఉన్నా.. అవసనరం లేకున్నా మొబైల్ చూడడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతోంది. ఇది కళ్లపై కూడా ఎఫెక్టయి చూపు మందగించే అవకాశం ఉంది.
అయితే తాజాగా అమెరికాకు చెందిన ఏఎం మెడికల్ సెంటర్ పిడయాట్రిషన్ కు చెందిన వైద్యులు ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలపై అధ్యయనం చేశారు. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతుందని గుర్తించారు. ఇదే సమయంలో పిల్లల్లో ఎక్కువగా ఉబకాయం పెరిగిపోతుందని తేల్చారు. మూడు దశాబ్దాలల్లో కౌమారపు దశలో ఉన్న పిల్లలు ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల 17 శాతం ఉబకాయం పెరిగిందని గుర్తించారు. వీరు ఫోన్ తో పాటు టీవీలు ఎక్కువగా చూడడం వల్ల ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
అధికంగా మొబైల్ వాడడం వల్ల పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. శారీరక గేమ్స్ కాకుండా మొబైల్ గేమ్స్ లో ఉండడం వల్ల వీరు అన్ ఫిట్ గా మారుతారని అంటున్నారు. అలాగే ప్రతిరోజు 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అంటున్నారు లేకుంటే భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని తేల్చారు. ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడానికి పిల్లల వయసులో ఉన్న సమయంలో ఎక్కువగా మొబైల్ స్క్రీన్ కు అతుక్కుపోవడమే కారణమని అంటున్నారు.
నేటి కాలంలో చిన్న పిల్లలకు అన్నం తినిపించే క్రమంలో మొబైల్స్ నుచూపిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి దూరం కావడానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని తెలిపారు. చిన్నప్పటి నుంచి వారికి అలవాటు చేయడం వల్ల పెద్దయ్యాక ఫోన్ లేకపోతే ఆహారం తీసుకోలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. అందువల్ల పిల్లలకు ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.