June Month: జూన్ నెలకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే.. ఈ నెలలో ప్రత్యేక దినాలు ఇవే..

జూన్ అనే పదం లాటిన్ నెల లూనియస్ నుంచి ఉద్భవించింది. దీనికి రోమన్ దేవత ఆయన జూనో (లాటిన్ పేరు లూనో) పేరు పెట్టారు. 13వ శతాబ్దంలో ఆంగ్లో నార్మన్ జాయిన్, జూన్యే, జూనీ ద్వారా ఈ పేరును సేకరించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 1, 2024 1:09 pm

June Month

Follow us on

June Month: క్యాలెండర్ పేజీల సాక్షిగా కాలం అత్యంత వేగంగా గడిచిపోతోంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే రోజులు మారిపోతున్నాయి.. ఇక ఈ సంవత్సరంలో ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయాయి. 2024 కు సంబంధించి శనివారంతో అర్ధ సంవత్సరాదిలోకి ప్రవేశించాం. జూన్ నెలతో ఆరో నెల కళ్ళ ముందుకు వచ్చింది.. ఇంతకీ ఈనెల పేరు జూన్ అని ఎందుకు పెట్టారు? ఈ నెల ప్రత్యేకతలు ఏంటంటే..

జూన్ అనే పదం లాటిన్ నెల లూనియస్ నుంచి ఉద్భవించింది. దీనికి రోమన్ దేవత ఆయన జూనో (లాటిన్ పేరు లూనో) పేరు పెట్టారు. 13వ శతాబ్దంలో ఆంగ్లో నార్మన్ జాయిన్, జూన్యే, జూనీ ద్వారా ఈ పేరును సేకరించారు.. అప్పటినుంచి జూన్ అనే పేరు ఈ నెలకు స్థిరపడిపోయింది. అయితే జూన్ అనే పేరు ఎందుకు పెట్టారు? దాని వెనుక కారణమేంటనేది ప్రత్యేకంగా తెలియదు. ఇక మనదేశంలో వేసవికాలం ముగింపుకు, వర్షాకాలం ప్రారంభానికి మధ్యన జూన్ నెల ఉంటుంది. జూన్ నెలలో మనదేశంలో కేరళ నుంచి అస్సాం వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయి. మనదేశంలో సుమారు 99 శాతం వ్యవసాయానికి ఈ నైరుతి రుతుపవనాలే ఆధారం. వీటి ఆధారంగానే వివిధ ప్రాజెక్టులు, జలాశయాల్లోకి నీరు చేరుతుంది. తాగునీటికి, సాగునీటికి ఈ నీరే ప్రధాన ఆదెరువు. జూన్ నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.. పాఠశాల విద్య నుంచి మాధ్యమిక స్థాయి వరకు విద్యా సంవత్సరం మొదలవుతుంది. వ్యవసాయ పనులు కూడా జూన్ నెలలోనే మొదలవుతాయి.. పునాస మామిడికాయలు ఈ కాలంలోనే లభ్యమవుతాయి.

జూన్ నెలలో ముఖ్యమైన రోజులు ఏవంటే..

జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం.
జూన్ 2న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం.
జూన్ 2న ఇటలీ గణతంత్ర దినోత్సవం.
జూన్ 2న అంతర్జాతీయ సె* వర్కర్స్ డే.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
జూన్ 4న ఇంటర్నేషనల్ ఇన్నోసెంట్ చైల్డ్ డే
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
జూన్ 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే
జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం
జూన్ 12న ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
జూన్ 12న జాతీయ రెడ్ రోజ్ డే
జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవం
జూన్ 14న మిథున్ సంక్రాంతి
జూన్ 15 ప్రపంచ వృద్ధుల హక్కుల అవగాహన దినోత్సవం
జూన్ 15 ఫాదర్స్ డే (జూన్ మూడవ ఆదివారం)
జూన్ 18 అటిస్టిక్ ఫ్రైడ్ డే
జూన్ 18 అంతర్జాతీయ పిక్నిక్ డే
జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం
జూన్ 21 ప్రపంచ మ్యూజిక్ దినోత్సవం
జూన్ 21 ఇంటర్నేషనల్ యోగ డే
జూన్ 21 వరల్డ్ హైడ్రోగ్రఫీ డే
జూన్ 22 వరల్డ్ రైన్ ఫారెస్ట్ డే
జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలంపిక్ డే
జూన్ 23 అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం
జూన్ 29 జాతీయ స్టాటిస్టిక్స్ డే
జూన్ 30 వరల్డ్ ఆస్టరాయిడ్ డే నిర్వహిస్తారు.