Akhanda 2 : బోయపాటి శ్రీను ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోతో సినిమా చేసిన కూడా ఆ సినిమా మొత్తం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేస్తూ ఉంటాడు. కానీ బాలయ్య బాబుతో సినిమా చేసినప్పుడు మాత్రం యాక్షన్ తో పాటు డైలాగ్స్ ని కూడా తూటాల్లా పేలుస్తూ ఉంటాడు. అందువల్లే వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది… వీళ్ళ కాంబోలో ఎప్పుడు సినిమా వస్తుందంటే యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆ మూవీ కోసం ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు…
నందమూరి నటసింహంగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు… వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన అఖండ 2 సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ కూడా ఉండబోతుందట. 100 మందితో బాలయ్య బాబు ఒక ఫైట్ చేయబోతున్నట్టుగా దర్శకుడు బోయపాటి శ్రీను క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఐతే ఉంటాయి. ఇక బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ అంటే ఫైట్లకు పెట్టింది పేరుగా చెప్పవచ్చు.
Also Read : అఖండ 2 లో యాక్షన్ డోస్ పెంచుతున్న బోయపాటి…
వీళ్ళ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికి అవన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి బోయపాటి లాంటి స్టార్ డైరెక్టర్ చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో కూడా బోయపాటి బాలయ్య బాబుని నెక్స్ట్ లెవెల్లో చూపించి బాలయ్య బాబు క్రేజ్ మరింత పెంచే విధంగా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… వీళ్ళ కాంబినేషన్ లో నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంటారా? లేదా అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ సినిమా నుంచి తొందర్లోనే ఒక టీజర్ ని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో బోయపాటి శ్రీను ఉన్నాడట. ఆ టీజర్ కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోవడమే కాకుండా రెండు భారీ డైలాగులను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
బోయపాటి లాంటి దర్శకుడు చేసే ప్రతి సినిమా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయి ఉంటాయి. ఇక బాలయ్య తో సినిమా అంటే ఆ యాక్షన్ డోస్ పెంచుతాడు. ఇక వీళ్ళ కాంబోను చూసి నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమాతో బాలయ్య వరుసగా ఐదోవా విజయాన్ని నమోదు చేసుకోవాలని కోరుకుందాం.
Also Read : అయోమయంలో పడ్డ ‘అఖండ 2’ నిర్మాతలు..వెనకడుగు వేయక తప్పదా?