Number Plates: వాహనాల నంబర్ ప్లేట్లు వివిధ రంగుల్లో ఎందుకుంటాయి? అలా ఎందుకు ఇస్తారు? అది దేన్నీ సూచిస్తుంది?

విదేశాలకు చెందిన డిప్లోమేట్స్, ఎన్ఏఐ, ఎఫ్ బీఐ లాంటి వారికి మాత్రమే ఇలాంటి వాహనాలు ఉంటాయి. ఇలాంటి వాహనాలకు దేశ వ్యాప్తంగా కోడ్ ను కేటాయిస్తారు.

Written By: Chai Muchhata, Updated On : September 26, 2023 10:23 am

Number Plates

Follow us on

Number Plates: ప్రతి వ్యక్తిని గుర్తించాలంటే ప్రత్యేకంగా అతనికి ఓ పేరు పెడుతారు. అలాగే వాహనాలను ఐడెంటిఫై చేయడానికి ఒక నెంబర్ ఇస్తారు. బైక్ లేదా కారుకు ఉండే ఈ నెంబర్ ను ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే ఆ వాహనం పై ప్రయాణించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొన్ని బైక్ లు, కార్లపై డిఫరెంట్ కలర్లతో నెంబర్లు ఉంటాయి. కొన్ని వాహనాలకు వైట్ ప్లేట్ పై బ్లాక్ లెటర్ తో ఉంటాయి. మరికొన్నింటింకి గ్రీన్ ప్లేట్ పై వైట్ లెటర్స్ ఉంటున్నాయి. ఇలా వాహనాలకు డిఫరెంట్ నెంబర్లు ఇవ్వడానికి కారణమేంటి? వాటిని ఏ వాహనాలు.

వైట్ ప్లేట్ పై బ్లాక్ లెటర్స్:
బైక్ లు లేదా కార్లపై తెల్లటి ప్లేట్ పై నల్లటి అక్షరాలు ఉంటాయి. ఇవి ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన వాహనాలకు రోడ్డు రవాణా సంస్థ ఇస్తుంది. వీటిని పర్సనల్ గా ఉపయోగించుకునే బైక్ లు లేదా కార్లకు వాడుతారు.

ఎల్లో ప్లైట్ పై బ్లాక్ లెటర్స్:
ఇలాంటి నెంబర్ ప్లేట్స్ ఎక్కువగా కార్లు, బస్సులు, లారీలకు కనిపిస్తాయి. ఇలాంటి నెంబర్లు ఉన్న వాహనాలు సరుకులు, ప్రయాణికును చేరవేరుస్తాయి. ఇవి పూర్తిగా కమర్షియల్ కి చెందినవి.

గ్రీన్ ప్లేట్ పై వైట్ లెటర్స్:
ఇటీవల ఈ నెంబర్ ప్లేట్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇలాంటివి ఎలక్ట్రికల్ వెహికిల్స్ కు మాత్రమే అమరుస్తారు. బస్సులు, బైక్ లు ఏదైనా పర్సనల్ గా ఉపయోగించే వాహనాలకు ఇవి కనిపిస్తాయి.

బ్లూ ప్లేట్ పై వైట్ లెటర్స్:
విదేశాలకు చెందిన డిప్లోమేట్స్, ఎన్ఏఐ, ఎఫ్ బీఐ లాంటి వారికి మాత్రమే ఇలాంటి వాహనాలు ఉంటాయి. ఇలాంటి వాహనాలకు దేశ వ్యాప్తంగా కోడ్ ను కేటాయిస్తారు.

రెడ్ ప్లేట్ పై వైట్ లెటర్స్:
ఇలాంటి నెంబర్ ప్లేట్ కనిపించే వాహనాలు టెంపరరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నవని అర్థం. అంటే ఇవి ఒక నెల వరకు మాత్రమే ఉంటాయి. ఆ తరువాత పర్మినెంట్ నెంబర్ వచ్చాక దీనిని తీసేస్తారు.

పైకి యారో సింబర్ ఉన్న నెంబర్ ప్లేట్స్:
మిలటరీలో పనిచేసేవారు ప్రత్యేకంగా వాహనాలను ఉపయోగిస్తారు. అలాంటివాహనాలకు ఈ నెంబర్ ను కేటాయిస్తారు. ఈ నెంబర్ ప్లేట్స్ పై ముందు లేదా చివరలో బాణం గుర్తు పైకి ఉంటుంది. ఆర్మీతో పాటు నేవీ వారికి ఇలాంటి నెంబర్ ఉంటుంది.

రెడ్ ప్లేట్ పై జాతీయ చిహ్నం:
రెడ్ ప్లేట్ పై ఎలాంటి నెంబర్ లేకుండా కేవలం మూడు సింహాల జాతీయ చిహ్నం ఉంటుంది. ఈ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు రాష్ట్రపతి, గవర్నర్లు మాత్రమే ఉపయోగిస్తారు.