Property Rights: తల్లి ఆస్తి ఎవరికి చెందుతుంది?

తండ్రి యజమాని అయితే ఆ ఆస్తిలో పిల్లలందరికి సమానంగా వాటా వస్తుంది. మరి తల్లి యజమాని అయితే ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరికి చెందుతాయి.

Written By: Swathi Chilukuri, Updated On : April 6, 2024 4:01 pm

Property Rights

Follow us on

Property Rights: ఆస్తులు.. వామ్మో ఇవి ఎంత మంచి బంధంలో అయినా చిచ్చులు పెడుతాయి. ఆస్తి పంపకాలు సరిగ్గా లేకపోయినా, కాస్త ఎక్కువ తక్కువ బేధం చూపించినా బద్ద శత్రువులుగా మారుతుంటారు అన్నదమ్ములు. అన్ని సమానంగా పంచినా కూడా అప్పుడు మీకు ఎక్కువ ఖర్చు చేశారు? సో ఇప్పుడు నాకు ఎక్కువ ఇవ్వాలి అని ఒకరు? లేదా అప్పుడు ఇప్పుడు ఒకటేనా అంటూ మరొకరు. ఇలా కూడా గొడవలు పెట్టుకుంటారు. అయితే వీలునామా రాస్తే సరే. లేదంటే మాత్రం ఆస్తుల విషయంలో గొడవలు కచ్చితంగా వస్తాయి.

తండ్రి యజమాని అయితే ఆ ఆస్తిలో పిల్లలందరికి సమానంగా వాటా వస్తుంది. మరి తల్లి యజమాని అయితే ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరికి చెందుతాయి. దీని గురించి చట్టం ఏం చెబుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తికి పూర్తిగా తల్లి యజమాని అయితే ఆ ఆస్తి కుమారులకు, కూతుర్లకు ఇద్దరికి ఆస్తి వస్తుంది. వీలునామా రాయకుండా చనిపోతే ఇద్దరు సమానంగా పంచుకోవాల్సిందే. కుమారులకు, కూతుర్లకు ఇద్దరికి కూడా సమానం హక్కులు ఉంటాయి అని చెబుతుంది చట్టం.

కుటుంబంలో వివాహిత, అవివాహిత కుమార్తెలు ఉన్న తల్లి ఆస్తి నుంచి లేదా పూర్వీకుల ఆస్తుల నుంచి ఆమెకు సమాన హక్కు ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి మీద కుటుంబంలోని కుమార్తెలకు సమాన హక్కులు ఉండేలా సవరణ చేశారు. హిందూ అవిభాజ్య కుటుంబంలో కుమారుడితో పాటు కుమార్తెలు కూడా సమానమైన హక్కులు, బాధ్యతలు కలిగి ఉంటారు. ఫ్యామిలీ ఆస్తిని పంచాలని అడిగే హక్కు, కొడుకులతో సమానంగా ఇవ్వాలనే డిమాండ్ చేయవచ్చట కూతుర్లు.

తల్లి తన ఆస్తి గురించి కుమారుల గురించి మాత్రమే వీలునామా రాసి, కుమార్తెల పేర్లు రాయకపోతే ఆ ఆస్తిలో కూతుళ్లకు ఎలాంటి హక్కు ఉండదు. వీలూనామా రాయని సందర్భంలో మాత్రం పూర్తి హక్కు ఇద్దరికి సమానంగానే ఉంటుంది. కాబట్టి వీలునామా ఉందా లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది తల్లి ఆస్తి.