WhatsApp Latest Update: వాట్సాప్.. ఇప్పుడు ఇది లేనిదే పూట గడవదు మనకు.. తిండి తినకుండా ఉండగలుగుతారు కానీ.. వాట్సాప్ లేనిదే అస్సలు ఉండరు. ఇది ఇంటి అవసరాలే కాదు.. ఆఫీసు అవసరాలు, పనులు, పేమెంట్స్ ఇలా మన అవసరాలన్ని తీరుస్తూ ఒక నిత్యావసరంగా మారిపోయింది. ప్రతీ ఏడు అప్డేట్ అవుతూ కొత్త ఫ్యూచర్లతో ఆకట్టుకుంటోంది.

వాట్సాప్ తో ఎన్ని అనుకూలతలు మేలు ఉన్నా కూడా.. కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. దీంతో గొడవలు, కొట్లాడలు, హత్యలు కూడా జరుగుతున్నాయి.విద్వేషాలు రెచ్చగొట్టుకోవడానికి ఆస్కారం ఇస్తోంది.ఇందులో ఏదైనా మెసేజ్ చేస్తే వేసిన వారు తప్ప వేరే వారు ఎడిట్ చేయడానికి లేదు. గ్రూప్ అడ్మిన్స్ కూడా ఇన్నాళ్లు డిలీజ్ చేయడానికి లేకుండేది. కానీ దీనివల్ల అనర్థాలు జరుగుతుండడంతో ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ను ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు.
వాట్సాప్ ఎడిట్ మెసేజ్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీని సహాయంతో ఇన్నాళ్లు మనం వేసిన కంటెంట్ ను ఎడిట్ చేసే వీలు ఉండేది కాదు.. కానీ ఇప్పుడు తప్పులను సరిదిద్దుకునే అవకాశం యూజర్ కు కల్పించారు. ఈ ఫీచర్ ను బీటా వెర్షన్ లో అమలు చేశారు. త్వరలోనే ఆండ్రాయిడ్ లో అందుబాటులోకి తేనున్నారు.

ఈ కొత్త ఫీచర్ తో ఇక మెసేజ్ ను పూర్తిగా డిలీట్ చేయకుండా కేవలం తప్పులను సరిదిద్దుకోగలిగితే సరిపోతుంది..