Kaleshwaram Contractor: కాళ్వేరం.. తెలంగాణ ముఖ్యమంత్రి మానస పుత్రిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదికే దానిని మొదలు పెట్టారు. రికార్డుస్థాయిలో 80 శాతం పనులు పూర్తిచేయించాడు. ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లుపు రాత్రి పగలు పనులు జరిగేలా నాటి నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ఆకస్మిక సందర్శనల ద్వారా ప్రాజెక్టుకు ఓ రేంజ్‌లోహైప్ తెచ్చారు. తాజాగా ఏడాది క్రితం ప్రాజెక్టు గురించి నేషనల్ జియోగ్రఫీ చానెల్‌లో ‘లిఫ్ ఏ ప్రాజెక్టు’ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారం చేయించి జాతీయస్థాయిలో ప్రచారం పొందారు. కానీ ఈ ఏడాది జూలైలో వచ్చిన వరదలకు ప్రాజెక్టు మోటార్లు దెబ్బతిన్నాయి. దాదాపు వెయ్యి కోట్ల వరకు నష్టం వచ్చిందని అంటున్నారు. కానీ ప్రభుత్వం పెద్దగా నష్టం జరుగలేదని, జరిగిన నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడని ప్రకటించింది. కానీ ప్రాజెక్టు సందర్శనకు మాత్ర ఎవరినీ అనుమతించడంలేదు. డ్యామేజీ ఫొటోలను కూడా నెల తర్వాత ప్రభుత్వమే విడుదల చేసింది అంటే ఎంత గోప్యత పాటిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రాజెక్టులో అక్రమాలపై విపక్షాలు కేసీఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్ర మంత్రులు కూడా కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అని రోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఖరీదైన వాచ్‌తో కనిపించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

రూ.5 కోట్ల వాచ్ ధరించిన కాంట్రాక్టర
సెలబ్రెటీలో ధరించే దుస్తులు, హ్యాండ్ బ్యాగ్‌లు, వాడే కార్లు వంటివి చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ముఖ్యంగా బయటికి వచ్చినప్పుడు వారిని ఫొటోలు తీసి, వారు వాడే వస్తువుల ధరలను ఆన్‌లైన్‌లో చెక్ చేస్తుంటారు. తీరా వాటి ధర తెలుసుకున్న తర్వాత లక్షల్లో ఉండడంతో అంతా అవాక్కవుతుంటారు. హీరోలు, హీరోయిన్ల విషయంలో మనం ఇలాంటివి నిత్యం గమనిస్తుంటాం. అయితే ఓ కాంట్రాక్టర్ ధరించిన వాచ్ ధర రూ.5 కోట్లు అంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ ఇది నిజం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ మేఘా పిచ్చిరెడ్డి ఆ ఖరీదైన వాచ్ ధరించాడు.
చిన్న పైపుల కంపెనీ యజమాని..
మేఘా బిల్డర్ అంటే ప్రస్తుతం తెలియని వారు ఉండరు.నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ చైర్మన్ పీపీ.రెడ్డి ఏ ప్రాజెక్టు చేపట్టినా అది భారీగానే ఉంటుంది. 1987లో చిన్న పైపుల తయారీ సంస్థగా మెఘా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెంచర్లు కలిగి ఉంది. జోర్డాన్, కువైట్, టాంజానియా, జాంబియా వంటి దేశాలలో కూడా ఈ సంస్థ ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే అప్పులు లేని సంస్థగా ఎంఈఐఎల్ ఘనత సాధించింది.
‘
మెఘా’ రికార్డులు
భారతదేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాకుండా ఈ సంస్థ ఫోర్బ్స్ జాబితాలో కూడా చేరింది. ఫోర్బ్స్ భారతీయ సంపన్నుల జాబితాలో అతని ర్యాంక్ 47 నుంచి 39కి చేరింది. అతను ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్–2019లో కూడా ఉన్నాడు.నిర్మాణ విభాగంలో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇలా భారీగా పెరుగుతున్న సంపదతో ఆయన వాడే వస్తువులు కూడా భారీగానే ఉంటాయి. ప్రస్తుతం రూ.5 కోట్ల ఖరీదైన ఆస్ట్రోనోమియా టూర్ బిల్లాన్ వాచ్‌ను ఆయన ధరించాడు. దీనిని 18 క్యారెట్ల పింక్ గోల్డ్‌తో తయారు చేశారు.

ట్రోల్ చేస్తున్న విపక్షాలు..
మెఘా చైర్మన్ రూ.5 కోట్ల విలువైన వాచ్ ధరించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లతోపాటు తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. కాళేశ్వరంలో కోట్ల అవినీతి నిజమే అని కొందరు కామెంట్స్ పెడతున్నారు. ఎన్ని వెనుకేసుకుంటే ఇత ఖరీదైన వాచ్ ధరించాలని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. విపక్ష నేతలు కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అనడానికి ప్రాజెక్టు కాంట్రాక్టరే నిదర్శనమని ట్రోల్ చేస్తున్నారు.