Love: ఒకప్పుడు ప్రేమ అనే పదం చాలా తక్కువ వినిపించేది. కానీ ప్రస్తుతం ఈ పదం ఎక్కువ వినిపిస్తుంది. స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా ప్రేమలో పడుతున్నారు. అట్రాక్షన్ కు పెట్టుకునే పేరే ఈ ప్రేమ. కానీ ఇదొక మధురమైన అనుభూతి. నిజమైన ప్రేమలో ఉన్న వారు జీవితాన్ని అందంగా ముస్తాబు చేసుకుంటారు. వారి జీవితంలో సంతోషాలే ఎక్కువ ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగా ఎదుర్కుంటారు. అయితే మిమ్మల్ని ఎవరు అయినా ప్రేమిస్తున్నారా? లేదా అని తెలిపే కొన్ని సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్లలోకి చూస్తుండటం.. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏ వైపు కూడా చూడకుంటా మిమ్మల్ని మాత్రమే చూస్తూ మీ కళ్లల్లోకి మాత్రమే తదేకంగా చూస్తున్నారంటే మిమ్మల్ని ఆ వ్యక్తి ప్రేమిస్తున్నారని అర్థం. ఈ ఒక్క క్వాలిటీతోనే మీరు డిసైడ్ చేసేయకండి. మిగిలినవి కూడా అబ్సర్వ్ చేస్తుండాలి. మీరు ఎవరితో మాట్లాడినా, ఎంత మందిలో ఉన్నా కూడా వారి కళ్లు మిమ్మల్ని వెతకడం, మీ కోసం తపన పడటం చేస్తుంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టు.
తాకడానికి.. మిమ్మల్ని ముట్టుకోవడానికి, లేదా మాట్లాడుతూ ఏదో ఒక విధంగా మిమ్మల్ని టచ్ చేస్తే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. మిమ్మల్ని ముట్టుకున్న తర్వాత చాలా కూల్ గా, లేదంటే హ్యాపీగా ఫీల్ అవడం వంటివి చేస్తుంటే కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టే అంటున్నారు లవ్ గురులు.
కేర్.. మీరు ఏదైనా చెబుతున్నప్పుడు చెప్పే విషయాన్ని శ్రద్దగా వింటూ మీ గురించి ఆలోచిస్తూ మీరు చేసిన మంచి పని గురించి ప్రశంసిస్తూ.. తప్పు చేస్తే కూల్ గా మీకు అర్థం అయ్యేలా చెబుతూ.. మీ వెన్నంటే నిల్చోవడానికి ప్రయత్నిస్తుంటారు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మీ పక్కనే ఉండాలనే భావనతో ఉన్నారంటే కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నటే.
ఆకర్షించేందుకు ప్రయత్నం.. మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం. ఎలాగైనా మిమ్మల్ని లవ్ చేసేలా తన గురించి మీకు తెలిసేలా చేయడం, మీ ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకోవడం వంటివి చేస్తుంటారు. మీకు నచ్చినట్టు డ్రెస్ చేసుకొని, హెయిర్ సెట్ చేసుకొని మీకు స్పెషల్ గా కనిపించేలా ప్రయత్నిస్తుంటారు.
ఎప్పుడు అందుబాటులో.. చాలా అత్యవసర సమయాల్లో మినహాయించి ప్రతి సమయం మీకు అందుబాటులో ఉంటారు. మీకు అద్దంలా మీతోనే ఉంటారు. ఎలాంటి కష్టంలో అయినా, మీకు అవసరం ఉన్న కాస్త సమయంలో అయినా సరే మీతోనే ఉండేలా అందుబాటులో ఉంటారు.
జెలసీ.. మీరు ఇతర వ్యక్తులతో మాట్లాడినా, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చినా వారు జెలసీ ఫీల్ అవుతారు. ఎక్కువ ఇతరులతో మాట్లాడుతుంటే ఎక్కడ వారికి పడిపోతారో, వారితో మీకు రిలేషన్ ఉందేమో.. లేదంటే రిలేషన్ అవబోతుంది కావచ్చు అని టెన్షన్ పడుతుంటారు. సో ఈ క్వాలిటీస్ ఉంటే మిమ్మల్ని ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్టే.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: What would they do if they loved you
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com