Amar Deep : అమర్ దీప్ నటుడు కావాలని పరిశ్రమకు వచ్చాడు. ఈ క్రమంలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అనంతరం సీరియల్ నటుడిగా మారాడు. కొన్ని వెబ్ సిరీస్లలో సైతం పాత్రలు చేశాడు. జానకి కలగనలేదు సీరియల్ సమయంలో ఆయనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అమర్ దీప్ కంటెస్ట్ చేశాడు. అమర్ దీప్ మొదట్లో తడబడ్డాడు. కొన్ని సమయాల్లో సిల్లీగా ప్రవర్తించి అబాసుపాలయ్యాడు. కానీ చివరి వారాల్లో అతడు పుంజుకున్నాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తో అమర్ దీప్ హౌస్లో గొడవలు పడ్డాడు.
ఫైనల్ లో వీరిద్దరి మధ్యే పోటీ నడిచింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కావడంతో అమర్ దీప్ కొద్దిలో అవకాశం కోల్పోయాడు. ఫినాలే ముగిశాక అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేయడం చర్చకు దారి తీసింది. దుర్భాషలాడుతూ తన తల్లి, భార్యతో పాటు తన మీద దాడికి యత్నించారని అమర్ దీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ షో అనంతరం అమర్ దీప్ సీరియల్స్ చేయడం లేదు. ఆయనకు హీరోగా అవకాశం వచ్చింది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. నటి సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : బిగ్ బాస్ కంటే నాకు అదే ముఖ్యం.. మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు అమర్ షాకింగ్ కామెంట్స్
కాగా ఇటీవల కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 స్టార్ మా లో మొదలైంది. ఈ షోలో అమర్ దీప్ కంటెస్ట్ చేస్తున్నాడు. తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఆసక్తి రేపుతోంది. తమ ఫస్ట్ లవ్ ఎవరో తెలియజేయాలని కోరగా, అమర్ దీప్ ఒకింత ఎమోషనల్ అయ్యాడు. తన కళ్ల ముందే లవర్ ని మరొకరు వెనక నుండి కౌగిలించుకున్నాడట. అది చూసి తాను వేదనకు గురయ్యానని వెల్లడించాడు.
అమర్ దీప్ మాట్లాడుతూ.. స్వయంగా అప్లికేషన్ ఫిల్ చేసి బస్ ఎక్కించిన అమ్మాయి, వేరొకరిని ప్రేమించింది. బస్ లో వస్తుందని నేను ఆ అమ్మాయి కోసం ఎదురుచూస్తుంటే, మరొకరు ఆమెను నా కళ్ళ ముందే వెనక నుండి హగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి.. అని ఎమోషనల్ అయ్యాడు. అమర్ దీప్ ఫస్ట్ లవర్ తనకు తెలియకుండా మరొకరిని ప్రేమించింది, అని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. కాగా అమర్ దీప్ సీరియల్ నటి తేజస్వి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె కూడా టెలివిజన్ షోలలో పాల్గొంటూ వినోదం పంచుతుంది.
Also Read : స్టార్ మా నుండి భారీగా ఛార్జ్ చేసిన అమర్ దీప్… ఎన్ని లక్షలు ఇచ్చారో తెలుసా?