Mental Pain: ప్రతి ఒక్కరికి జీవితం బంగారు నోట్లో పెట్టే విధంగా ఉండదు. ఎవరైనా కష్టాలు, సుఖాలు అనుభవించాల్సిందే. అయితే వారి జాతకం ప్రకారం కొందరికి ఎక్కువ కష్టాలు.. కొందరికి తక్కువ కష్టాలు ఉంటాయి. అయితే వీటినుంచి బయటపడి లక్ష్యాన్ని చేరుకోవడమే మనిషి చేసే ప్రధాన విధి. కానీ కొందరు తమకే ఎక్కువ కష్టాలు ఉన్నాయని.. మిగతావారు అంతా సంతోషంగా ఉన్నారని బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా తమకున్న కష్టం నుంచి బయటపడేయాలని స్నేహితులకు.. కుటుంబ సభ్యులకు చెబుతూ ఉంటారు. కానీ ఇలా చెప్పడం వల్ల ఎవరికి ప్రయోజనం? అంతేకాకుండా ఇలా ప్రచారం చేసుకోవడం వల్ల మరింత బాధపడే అవకాశం ఉంటుందని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి?
ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఆటుపోట్లు ఉంటాయి. వీటిని ఎదుర్కోవడానికి కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. మరికొందరు మాత్రం వీటిని చూస్తూ బాధపడి పోతారు. అయితే కష్టం వచ్చినప్పుడు.. తమకు మాత్రమే పెద్ద కష్టం ఉందని బాధపడకుండా.. వీటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అందుకోసం ముందు ప్రశాంతంగా మారాలి. ప్రశాంతంగా మారాలంటే ప్రశాంతమైన వస్తువులను చూడాలి. అంటే దేవుళ్ళ విగ్రహాలను చూస్తూ ఉండిపోవాలి. ఎందుకంటే ప్రతి దేవుడి విగ్రహం లేదా చిత్రపటం నవ్వుతూ కనిపిస్తుంది. అయితే కొన్ని దేవుల విగ్రహాలు గంభీరంగా ఉంటాయి. ఈ సమయంలో మాత్రం నవ్వుతూ ఉండే విగ్రహాలు లేదా చిత్రపటాలను చూస్తూ ఉండాలి. ఇలా చూడడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. లేదా ఇలాంటి సమయంలో తమ కష్టం గురించి ఇతరులకు చెప్పుకోకుండా.. సంతోషంగా ఉండే వ్యక్తులతో మాట్లాడాలి. ఎక్కువగా మంచి విషయాలు చెప్పే వారిని కలుస్తూ ఉండాలి. దీంతో వారికి ఉన్న కష్టం తాత్కాలికంగా తొలగిపోతుంది. ఇప్పుడు ప్రశాంతంగా మనసు మారిన తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి.
Also Read: మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా? అయితే ఈ విషయాలు మీకోసమే..
చాలామంది తమకు కష్టాలు ఉన్నాయని ఇతరులకు చెబుతూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల ఎవరికి నచ్చిన విధంగా వారు సలహాలు ఇచ్చేస్తుంటారు. వారు ఇచ్చే సలహాలు వారి జీవితానికి సంబంధించినవి ఉంటాయి. అలాంటప్పుడు ఇంకొకరి జీవితాన్ని ఎలా బాగు చేస్తారు? అందువల్ల ఎవరి కష్టం వారిదే.. ఎవరి సంతోషం వారిదే. అయితే కుటుంబ సభ్యుల్లో మాత్రం ఒకరి కష్టాన్ని మరొకరితో పంచుకోవచ్చు. కొందరు చిన్నపిల్లలు తమ కష్టం గురించి చెప్తే తల్లిదండ్రులు వారికి ఉన్న సమస్యలను తొలగించాలి. అంతేగాని పట్టించుకోకుండా ఉండడంవల్ల మరింత పెద్ద సమస్యగా మారుతుంది. ఇలా సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడం వల్ల జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతుంది. అంతేకాకుండా మీతో పాటు ఉన్న వారిని కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారు
మనసులో ఏదో ఒకటి అలజడి ఉండకుండా.. ఎక్కువగా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. ఇలా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎలాంటి కొత్త వ్యాధులు రాకుండా ఉంటాయి. అందువల్ల సమస్యలను చూసి భయపడకుండా.. వాటి పరిష్కారానికి ఎవరికి వారే ఆలోచించుకోవాలి.