Benefits of walking: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం, వ్యాపారం చేస్తూ ఎంతో బిజీగా ఉండేవారు.. ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సమయం లేకపోవడం వల్ల.. బద్ధకం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు వ్యాయామం చేయాలని అనిపించినా చేయలేకపోతున్నారు. అయితే కొందరు వ్యాయామం చేస్తున్నా.. వారిలో ఎటువంటి ఆరోగ్యకరమైన మార్పులు రావడం లేదు. దీంతో ఆరోగ్య పరిరక్షణ కోసం అనేక రకాల మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అయితే వ్యాయామంలో భాగంగా కొందరు ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా సరైన ఫలితాలు ఉండడం లేదు. కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం జపాన్ వాకింగ్ టెక్నిక్ యూస్ చేయడం వల్ల తొందరగా మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలు జపనీయులు ఎలాంటి వాకింగ్ చేస్తారు?
జపాన్ దేశంలో వయసు పైబడిన వారు పెరిగిపోతున్నారు. అంటే వారు ఆరోగ్యంగా ఉండడంతో ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. ఆరోగ్యం కోసం జపనీలు కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ వాడుతారు. వీటిలో ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనినే జపాన్ వాకింగ్ అని కూడా అంటారు. వీరు దీనిని ఫాలో కావడం వల్ల ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారని తెలుపుతున్నారు. అయితే ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే?
సాధారణంగా వాకింగ్ అనగానే మనలో చాలామంది కొందరు నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. మరికొందరు వేగాన్ని పెంచుతూ ఉంటారు. ఇంకొందరు స్నేహితులతో మాట్లాడుతూ నడుస్తూ ఉంటారు. అయితే జపనీలు మాత్రం ఇలా సాధారణంగా కాకుండా భిన్నంగా వాకింగ్ చేస్తారు. వీరు వాకింగ్ను మార్చి మార్చి చేస్తారు. అంటే మూడు నిమిషాల పాటు వేగంగా వాకింగ్ చేస్తారు. ఆ తర్వాత మూడు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేస్తారు. ఇలా వాకింగ్ స్టైల్ ను మారుస్తూ ఐదుసార్లు చేస్తారు. ప్రతి ఒక్కరూ ఇదే పాటించడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయని జపనీయులు అంటున్నారు. అంతేకాకుండా ఈ వాకింగ్ చేయడం వల్ల తమ వయసు తగ్గినట్లు అనిపిస్తుందని పేర్కొంటున్నారు.
Also Read: బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలి?
ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ చేయడం వల్ల శరీరంలో మార్పులను వేగంగా గమనించవచ్చు. ఇలా వేగంగా, నెమ్మదిగా వాకింగ్ చేయడం వల్ల కండరాల్లో కదలిక ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గుండె పనితీరు మెరుగుపడుతుంది. మార్చి మార్చి వాకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో శ్వాస ఎక్ససైజ్ చేసినట్టు అవుతుంది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా శ్వాసను తీసుకోగలుగుతారు. ఇవే కాకుండా వీరు 8 వాక్కును కూడా ఫాలో అవుతారు. అంటే ఒక ఎనిమిది అంటే నువ్వు పెద్దగా గీసి.. దీనిపై వేగంగా నడుస్తారు. ఇలా 8 అంకె పై నడవడం వల్ల మానసికంగా వృద్ధి చెందుతారు. దీంతో నెగటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయని అంటున్నారు. ఇలాంటి వాకింగ్ చేయడంవల్ల శారీరక మార్పులతో పాటు మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారని జపనీలు పేర్కొంటున్నారు. దీనిని సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.