Health Tips: రేపటి నుంచి ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది. అందరు డిసెంబర్ 31 ఎంజాయ్ చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలనేదానిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. కొత్త పనులు చేసేందుకు మొగ్గు చూపరు. ఏదో సాగిపోతుందిలే అనే ధోరణిలోనే అందరు కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త సంవత్సరమంటే కొత్త ఆలోచనలు తీసుకుంటే జీవితం ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక వేసుకోవాలి. నిత్యం నూతనంగా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అందుకోసం మన జీవనశైలిని మార్చుకోవడం ఉత్తమం.

పరిశుభ్రతకు పెద్ద పీట వేయండి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఫోకస్ పెట్టండి. అన్ని విషయాల్లో నీట్ గా ఉంటామని ప్రతిన బూనండి. దీంతో మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. మన ఇంటి ఆవరణ చెత్తమయంగా ఉంటే మనకు కష్టాలే దిక్కు. అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం కేటాయించుకోండి. జీవితభాగస్వామి, పిల్లలతో సంతోషంగా గడిపితే కూడా ఆరోగ్యం మన వెన్నంటి ఉంటుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు పంచుకుంటూ వారితో కలిసి ఉండటం వల్ల లాభాలు ఉంటాయి.
ఇంటి బడ్జెట్ ను కూడా హద్దులు దాటకుండా చూసుకోవాలి. ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుని ఖర్చులు అంచనా వేసుకుని అప్పు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. రుణాలిస్తామని ఎంత మభ్యపెట్టినా బెండ్ కావద్దు. ఖర్చు రాబడి కంటే మించితే కష్టాలు తప్పవు. మనం ఆనందంగా ఉండాలంటే ఖర్చులు పెరగకుండా నిర్ణయాలు తీసుకోవాలి. మన ఆరోగ్యం కోసం నిద్ర కూడా తప్పనిసరి. రోజుకు కనీసం ఆరు గంటలు నిద్ర పోకపోతే సమస్యలు వస్తాయి. రోగాలు దరిచేరతాయి. అందుకే నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఫిట్ నెస్ పై దృష్టి పెట్టండి. సన్నగా ఉన్నంత మాత్రాన ఫిట్ గా ఉన్నట్లు కాదు. శరీరం స్ర్పింగ్ లా వంగితేనే ఫిట్ గా ఉన్నట్లు లెక్క. అంతేకాని తాము సన్నగానే ఉన్నామనే ధోరణి కరెక్ట్ కాదు. జిమ్ కు వెళ్లే బదులు గార్డెన్ లో పనులు చేయడం ద్వారా మనకు రెండువిధాలా ప్రయోజనాలు దక్కుతాయి. యోగా చేసేందుకు సమయం కేటాయించుకుంటే ఆరోగ్యం మన వశమవుతుంది. తిండి విషయంలో కూడా మేల్కోండి. జంకు ఫుడ్ వైపు చూడకండి. ప్రొటీన్లు ఉన్న ఆహారాలను తీసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోండి.
మీ ఆలోచనలకు కొత్తదనం ఉండాలంటే కొత్తగా ఆలోచించండి. ఏవైనా నేర్చుకోవడానికి విలువ ఇవ్వండి. సంగీతం నేర్చుకున్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కొత్త సంవత్సరంలో మన జీవనశైలిని మార్చుకుని జీవితం బాగుండేలా డిజైన్ చేసుకోండి. అప్పుడే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి మనకు ఎన్నో రకాల లాభాలుంటాయి.