Naresh-Pavitra Lokesh Lip Lock: నటుడు నరేష్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఆయన వేషధారణే కాదు ఆలోచనలు కూడా టీనేజ్ ని తలపిస్తున్నాయి. పవిత్ర లోకేష్ తో బంధం మొదలయ్యాక నరేష్ యంగ్ గా కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. మీసం కూడా లేకుండా క్లీన్ షేవ్ చేసి, జీన్స్, టీషర్ట్స్ ధరిస్తున్నారు. మరి 62 ఏళ్ల నరేష్ 43 ఏళ్ల పవిత్ర లోకేష్ అందానికి పోటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముసలి మొగుడు కుర్ర పెళ్ళాం అని ఎగతాళి చేయకుండా ఉండాలంటే ఆ మాత్రం మైంటైన్ చేయక తప్పదు. తమని తాము కుర్ర జంట అని నిరూపించుకునే క్రమంలో నరేష్ చేసిన తాజా చర్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.

ఆయన ప్రేయసి పవిత్ర లోకేష్ కి ఘాటైన లిప్ కిస్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ లో రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంటే, ఇద్దరూ మమేకమై చుంబనం చేశారు. ఆకాశంలో బాణాసంచా కాంతులు విరజిమ్ముతుంటే నరేష్ తన సహచరిణిని ముద్దుల్లో ముంచెత్తాడు. న్యూ ఇయర్ ముందు రోజు విడుదలైన ఈ రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నెటిజెన్స్ కొత్త సినిమాలా వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు. స్నేహితులు, సన్నిహితులతో పంచుకొని గంటల తరబడి చర్చించుకుంటున్నారు.
స్టార్ హీరో సినిమాకు మించిన పబ్లిసిటీ ఆ వీడియోకి దక్కింది. ఇక నరేష్-పవిత్రల ఈ వీడియో నేపథ్యం ఏమిటంటే… వారు వివాహ బంధంలో ఒక్కటవుతున్నారు. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు నరేష్ అధికారికంగా ప్రకటించారు. తన ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలియజేశారు. ఆ ప్రకటనలో భాగంగా ఈ లిప్ లాక్ వీడియో షేర్ చేశారు.

గతంలో నరేష్ వివాహ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు. కలిసి జీవించడానికి పెళ్లి లైసెన్సు మాత్రమే. అంతకు మించి పెళ్ళికి ఉన్న విశిష్టత ఏమీ లేదన్నారు. ప్రస్తుతానికి పవిత్ర లోకేశ్ ని పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను అన్నారు. చెప్పినట్లే నరేష్ ఆలోచన మారింది. వివాహం చేసుకొని పవిత్రతో తన బంధాన్ని అధికారికం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతితో విడిపోయాక నరేష్ పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు
