https://oktelugu.com/

Aamir Khan: స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి కమిట్ అయిన అమీర్ ఖాన్…

అమీర్ ఖాన్ మొఖానికి మేకప్ వేసుకొని దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ "లాల్ సింగ్ చద్దా " సినిమా తర్వాత మరొక సినిమాకి కమిట్ అయితే అవ్వలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : May 1, 2024 / 03:55 PM IST

    Aamir Khan next film with Sanjay Leela Bhansali

    Follow us on

    Aamir Khan: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా అస్తవ్యస్తం గా తయారైంది. తెలుగు హీరోలు కొట్టే దెబ్బను తట్టుకోలేక బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు చతికలబడి పోతున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలన్ని కూడా మెల్లమెల్లగా బాలీవుడ్ ఇండస్ట్రీని డామినేట్ చేసే విధంగా సినిమాలు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఖాన్ త్రయం చేసే సినిమాలేవి సరిగ్గా ఆడడం లేదు. కాబట్టి బాలీవుడ్ హీరోలు తప్పకుండా ఇప్పుడు భారీ సక్సెస్ లు అందుకోవాలనే కాన్సెప్ట్ తో ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే అమీర్ ఖాన్ మొఖానికి మేకప్ వేసుకొని దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ “లాల్ సింగ్ చద్దా ” సినిమా తర్వాత మరొక సినిమాకి కమిట్ అయితే అవ్వలేదు. మరి ఆయన సినిమా చేయడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాడు. అనే అనుమానాలు సగటు ప్రేక్షకులలో కూడా చాలా వరకు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పిరియాడికల్ సినిమాలను తీసి సక్సెస్ లు అందుకోవడంలో నైపుణ్యం ఉన్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ…ఇక ఇంతకు ముందు ఆయన బాజీరావ్ మస్తాని, పద్మావత్, రామ్ లీలా లాంటి సినిమాలు చేశాడు…

    అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే వీళ్ల కాంబినేషన్ లో పిరియాడికల్ డ్రామాగా ఒక సినిమాని తెరకెక్కించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ తెలుగు సినిమా డైరెక్టర్లతో సినిమాలు చేయాలని చాలా ప్రయత్నం చేసినప్పటికీ అవి ఏవి వర్కౌట్ అయితే అవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

    ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక పక్క రాజమౌళి పాన్ వరల్డ్ లో మహేష్ బాబు తో సినిమా చేస్తుంటే అమీర్ ఖాన్ ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ తో సినిమా చేసి భారీ సక్సెస్ ని మూట గట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో అమీర్ ఖాన్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనేది…