Palle Pandaga 2.0: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖకు ఐటీ సంస్థలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు అమరావతి నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో సైతం అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటువంటి సమయంలో గ్రామాల్లో మౌలిక వసతులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాలని తాజాగా నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా రూ.6,500 కోట్లతో వివిధ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
,* పల్లె పండుగ పేరుతో పనులు
పవన్ కళ్యాణ్( AP deputy CM ) ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారు. పెద్ద ఎత్తున గ్రామాల్లో రహదారులు, కాలువల నిర్మాణం పూర్తయింది. అయితే ఇప్పుడు మరోసారి పల్లె పండుగా 2.0 ప్రారంభించాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 52,000 పనులకు శ్రీకారం చుట్టి.. పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది మాదిరిగానే పనులు ప్రారంభించి సంక్రాంతికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా తెలుస్తోంది.
* ఎక్కడి సమస్యలు అక్కడే..
వైయస్సార్ కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో మౌలిక వసతులు కల్పించలేదు. రహదారులతోపాటు కాలువల నిర్మాణం వంటివి చేపట్టలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్టు విడిచిపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె పండుగ 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఇటీవల సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. గత ఏడాది పల్లె పండుగలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతోనే పనులు చేపట్టారు. రోడ్లు, కాలువలు, గో కులాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
పల్లె పండుగ పేరుతో గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్ల మేర సిమెంట్, తారు రోడ్లు నిర్మించారు. ఈసారి ఉపాధి హామీ పథకంతో పాటు నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రాజెక్ట్, 15వ ఆర్థిక సంఘం, పంచాయితీ సాధారణ నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించి పల్లె పండుగ 2.0 పరిధిలోకి తీసుకొస్తున్నారు. పల్లె పండుగ 2.0లో 1107 పంచాయితీల్లో 55 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు సైతం నిర్మిస్తుండడం విశేషం.