Phones Blast: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. ఫోన్ లేనిదే ఉండటం లేదు. అది వాడకుండా ఒక్క క్షణం కూడా ఆగడం లేదు. చేతిలో ఫోన్ లేనిదే ఏ పని చేయడం లేదు. మన జీవితంలో ఫోన్ అంతలా పెనవేసుకుపోయింది. దీంతో ఫోన్ ఉపయోగం పెరిగింది. దీంతో లాభాలు, నష్టాలు రెండు ఉన్నాయి. కొందరు ఫోన్లతో కూడా సంపాదిస్తున్నారు. మరికొందరు వాటితో కంట జబ్బులు తెచ్చుకుంటున్నారు. అక్కడక్కడ బ్యాటరీలు పేలుతున్నాయి. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలడానికి కారణాలేంటో తెలుసా?
స్మార్ట్ ఫోన్లు లిథియం, అయాన్ తో తయారవుతున్నాయి. ఇవి పనిచేయడానికి బ్యాటరీ అవసరం. దానికి చార్జింగ్ అవసరం. ఫోన్ కు చార్జింగ్ లేకపోతే నడవదు. ఈక్రమంలో రోజు చార్జింగ్ పెట్టుకోవాలి. ఈనేపథ్యలో కొన్ని ఫోన్లు పేలిపోతున్నాయి. దీని వల్ల నష్టం కూడా జరుగతుంది. ఫోన్ బ్యాటరీ భాగాలు విచ్ఛిన్నమైనప్పుడు అవి అస్థిర ప్రతిచర్యకు దారి తీస్తాయి. దీని వల్ల ఫోన్ పేలిపోయే అవకాశాలు ఉంటున్నాయి.
ఫోన్ బ్యాటరీ దెబ్బతినడానికి ఫోన్ లో నుంచి వచ్చే వేడి ప్రధాన కారణం. మనం చార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీ త్వరగా వేడెక్కితే పోన్ పేలుతుందని గుర్తించాలి. దీంతో థర్మల్ రన్ అవే అనే చైన్ రియాక్షన్ జరిగి బ్యాటరీ వేడిగా మారుతుంది. ఫలితంగా పోన్ కు మంటలు అంటుకుంటాయి. దీని వల్ల ఫోన్ పేలుతుంది. ఆ సమయంలో పక్కన ఉన్న వారికి కూడా ప్రమాదమే.
ఫోన్ ను ఎక్కువ సేపు ఎండలో ఉంచితే సూర్యరశ్మి ప్రభావం చేత వేడిగా అవుతుంది. దీంతో సీపీయూలోని మాల్వేర్ ఫోన్ పేలిపోయేందుకు కారణమవుతుంది. ఒకవేళ ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లయితే తక్షణమే దాన్ని తీసివేయాలి. బ్యాటరీ పేలిపోతే మనకు నష్టం జరుగుతుంది. మళ్లీ కొత్త ఫోన్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో బ్యాటరీని జాగ్రత్తగా పరిశీలించారు. ఫోన్ పేలిపోయే అవకాశం ఉంటే త్వరగా బాగు చేసుకోవడం ఉత్తమం.