Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్… ముహూర్తం ఫిక్స్!

ఆదిపురుష్ మూవీ ఆరు నెలలు వెనక్కిపోవడానికి కూడా కారణం ఇదే. నిజానికి 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. అధికారిక ప్రకటన తర్వాత వాయిదా వేశారు. ఇక ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి రాముడు పాత్ర చేస్తున్నారు.

Written By: Shiva, Updated On : May 3, 2023 12:42 pm
Follow us on

Adipurush Trailer: ఆదిపురుష్ విడుదలకు సమయం దగ్గర పడింది. మరో నెలన్నర సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. పోస్టర్స్, మోషన్ పోస్టర్స్ వరుసగా విడుదల చేస్తున్నారు. ఆదిపురుష్ నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ ఆసక్తి రేపుతోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ మేకర్స్ టైం ఫిక్స్ చేశారట. మే 9న ఆదిపురుష్ ట్రైలర్ భారీగా లాంచ్ చేయనున్నారట. ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారట. ఆదిపురుష్ ట్రైలర్ నిడివి మూడు నిమిషాలు పైన ఉంటుందట. ఆల్రెడీ ట్రైలర్ కట్ చేశారట. ట్రైలర్ చూసిన ప్రభాస్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారట.

ఇప్పటి వరకు ఆదిపురుష్ చిత్రం మీదున్న నెగిటివిటీ మొత్తం దూరం చేసేదిగా ట్రైలర్ ఉండనుందట. ట్రైలర్ చూశాక యూనిట్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ట్రైలర్ లాంచ్ కి ప్రత్యేకమైన ప్రదేశం ఎంచుకునే ఆకాశం కలదు. ఇది సెంటిమెంట్స్ తో కూడిన చిత్రం కావడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.

కాగా ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. హిందువర్గాలు కొన్ని అంశాలను వ్యతిరేకించాయి. టీజర్లో పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని కొందరు విమర్శలు చేశారు. ముఖ్యంగా రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్ ని తప్పుబట్టారు. రావణాసురుడు శివ భక్తుడు. ఆయన రూపం గురించి రామాయణంలో రాసి ఉంది. మీకు ఇష్టం వచ్చినట్లు పురాణ పాత్రలను చూపిస్తారా అని మండిపడ్డారు.

ఆదిపురుష్ మూవీ ఆరు నెలలు వెనక్కిపోవడానికి కూడా కారణం ఇదే. నిజానికి 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. అధికారిక ప్రకటన తర్వాత వాయిదా వేశారు. ఇక ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి రాముడు పాత్ర చేస్తున్నారు. సీతగా కృతి సనన్ నటిస్తుంది. బాహుబలి 2 అనంతరం వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన ప్రభాస్ కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నారు. మరి ఆదిపురుష్ ఆయనకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.