Parenting tips: నేటి కాలంలో పిల్లలను పెంచడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే మాటలు కొందరు పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు. సమాజంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఇంట్లో వారు చెప్పింది వినకుండా పక్కదారి పడుతున్నారు. అయితే సాధ్యమైనంతవరకు తల్లిదండ్రులు తమ ప్రయత్నం చేస్తూ పిల్లలను సక్రమ దారిలో ఉంచేందుకు ప్రయత్నించాలి. అంటే కొన్ని విషయాల పట్ల వారితో జాగ్రత్తగా మెదలాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పించే ప్రయత్నం చేయాలి. వారికి ఎలాంటి ఆస్తుల గురించి కానీ.. కష్టాల గురించి గానీ చెప్పకూడదు. అలా చెబితే ఏం జరుగుతుందంటే?
Also Read: జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల.. షాకింగ్ లుక్ లో.. ఎలా ఉన్నాడో చూడండి
చిన్నపిల్లల మనస్తత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు ఈ వయసులో జరిగిన ఏదైనా విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు.. అలాగే తల్లిదండ్రులు చెప్పే కొన్ని విషయాలను వారు సరైన విధంగా అర్థం చేసుకోలేక పోతారు. ఇలాంటి సమయంలో ప్రణాళిక ప్రకారంగా వారికి అసలు విషయాలు చెప్పాలి. అంటే డబ్బు విషయంలో వారితో అన్ని విషయాలు పంచుకోకుండా ఉండడమే మంచిది. తమకు ఎంత ఆస్తి ఉన్నది? ఎంతవరకు భూములు ఉన్నాయి? ఇది డబ్బులు ఉన్నాయి? అనే విషయాలను వారికి చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల తమకు ఎంతో ధనం ఉందని.. చదవాల్సిన అవసరం లేదని.. పనిచేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదని ముందే అనుకుంటారు. దీంతో సోమరిపోతుగా మారిపోతాడు. అందువల్ల డబ్బు విషయం లో జాగ్రత్తగా ఉండాలి. అంటే తల్లిదండ్రులు బాగా కష్టపడుతున్నారని.. ఇంటికి ఏమాత్రం లోటు లేదు అనే విషయాన్ని చెబుతూ ఉండాలి.
ఇక కష్టాల గురించి కూడా పిల్లలతో ఎక్కువగా చర్చించకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వారు నిత్యం కష్టంలో ఉన్నామని భావిస్తే ఏ పని చేయలేకపోయే విధంగా మారుతారు. ముఖ్యంగా చదువులో కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఉత్సాహం చూపించరు. ఇంట్లో ఉన్న కష్టాలను వారికి చెప్పడం వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది. ఈ క్రమంలో చదువుపై దృష్టి పెట్టలేక పోతారు. అందువల్ల ఇంట్లో కష్టాల గురించి పిల్లలతో చర్చించకుండా ఉండడమే మంచిది.
Also Read: అది బొద్దింక కాదట.. వెంట్రుకట.. హోంమంత్రి అనిత వీడియో వైరల్..
మరి ఇలాంటి సమయంలో పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? అనే సందేహం రావచ్చు. డబ్బు విషయంలో అయితే వారికి అవసరం మేరకు మాత్రమే ఇంట్లో ఉన్నాయన్న విషయం చెప్పాలి. అలాగే కష్టపడితేనే డబ్బు వస్తుంది అనే విషయాన్ని వివరించాలి. తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడుతున్నారని.. వారు కష్టపడడం వల్లే అవసరాలు తీరుతున్నాయని చెప్పాలి. ఇక వారికి కష్టాలు చెప్పకుండా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. వారితో స్నేహపూర్వకంగా ఉండడం వల్ల చదువులో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారు ఎలాంటి చదువు కోరుకుంటున్నారో .వారికి అనుగుణంగా ఉండడంవల్ల మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. అంతేకాకుండా పిల్లలకు ఏదైనా సందేహం వస్తే వెంటనే నివృత్తి చేసేలా తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. లేకపోతే వారికి ఇది సమస్యగా మారి చదువులో రాణించలేకపోతుంటారు. ఈ విధంగా పిల్లలకు రెండు విషయాల్లో తల్లిదండ్రులు చాకచక్యంగా వ్యవహరించాలి.