Krishnashtami 2025: శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం దశావతారాలను ఇస్తాడు. ఇందులో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించి లోకానికి ధర్మాన్ని చాటి చెప్పాడు. అందుకు ప్రతీకగా శ్రీకృష్ణుడిని స్మరించుకుంటూ ఆ స్వామి జన్మాష్టమిని జరుపుకుంటూ ఉంటారు. 2025 సంవత్సరంలో ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి జరగనుంది. ఈ సందర్భంగా దేశంలో పలుచోట్ల ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. అయితే శ్రీకృష్ణాష్టమి రోజు స్వామి మందిరాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనుగ్రహం ప్రసాదిస్తాడని అంటారు. అయితే ఈ సమయంలో శ్రీకృష్ణుడికి ఈ ఒక్క పత్రం ఇస్తే ఎంతో సంతోషిస్తాడట. అదేంటంటే?
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి ఎన్నో రకాల పూలు, పండ్లు తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఏ దేవుడికి ఏది ఇష్టమో దానిని తీసుకెళ్లడం ద్వారా ఆ స్వామి ఇష్టపడుతూ ఉంటారని కొందరు చెబుతుంటారు. శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన పత్రం ఏదంటే తులసి. నేటి కాలంలో ప్రతి ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో ఉండేవారు సైతం కుండీల్లో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ తులసి చెట్టును దైవంగా భావిస్తారు. ప్రతిరోజు పూజలు చేస్తారు. శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన పత్రం తులసి అని చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పత్రంలో శ్రీకృష్ణాష్టమి రోజు సమర్పిస్తే ఎంతో మంచిదని అంటున్నారు. శ్రీకృష్ణుడికి, తులసికి ఉన్న సంబంధం ఏంటో ఈ యొక్క కథ ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణుడికి సతీమణుల్లో సత్యభామ ఒకరు. సత్యభామకు శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. అయితే ఒకసారి నారద మహర్షి సత్యభామ వద్దకు వచ్చి.. శ్రీకృష్ణుడికి బహుమతులు ఇస్తే అతడిని పొందవచ్చు అని చెబుతాడు. దీంతో సత్యభామ సరే అంటుంది. ఇందులో భాగంగా ఒకసారి తులాభారంను నిర్వహిస్తారు. ఈ తులాభారంలో ఒకవైపు సత్యభామ దగ్గర ఉన్న ధనం, బంగారం వంటి విలువైన వస్తువులను ఒక త్రాసులో వేస్తారు. మరో త్రాసులో శ్రీకృష్ణుడు కూర్చుంటాడు. అయితే సత్యభామ వేసిన ఎన్నో సంపదలకు శ్రీకృష్ణుడు సరి తూగడు. కానీ రుక్మిణి వేసే ఒక చిన్న తులసీదళం తో శ్రీకృష్ణుడి త్రాసు పైకి లేస్తుంది.
పత్రం పుష్పం పలం తోయం యోమె భక్త్యా ప్రయచ్చతి .. అనే శ్లోకం ప్రకారం శ్రీకృష్ణుడికి ఎంత సంపద ఇచ్చినా ఇష్టం ఉండదు.. భక్తితో ఒక పుష్పం లేదా ఫలం ఇస్తే ఎంతో సంతోషిస్తాడు అని ఈ తులాభారం కథ చెబుతుంది. అందువల్ల శ్రీ కృష్ణాష్టమి రోజు ఆ స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళంను సమర్పించడం వల్ల అనేక కోరికలను తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎంతో పవిత్రంగా భావించే ఈ రోజు తులసికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని అంటున్నారు. తులసి ఆకు లేకుండా ఏ నైవేద్యము సంపూర్ణంగా అనిపించదు. కొన్ని ప్రసాదాల్లో తులసిని తప్పనిసరిగా ఉంచుతారు.