Mouth Breathing: మనలో చాలా మందికి నోరు తెరిచి నిద్రపోవడం అలవాటు ఉంటుంది. నిజానికి ఈ సమస్య చాలా మందిలోనే కనిపిస్తుంది. నిద్రపోయాక నోరు తెరిచి గురక పెట్టడం మామూలే. ముక్కు రంధ్రాల్లో ఏదైనా అడ్డుపడితేనే నోటి నుంచి శ్వాస తీసుకోవడం చేస్తుంటారు. దీంతోనే గురక శబ్ధం కూడా వస్తుంది. నోరు తెరచి నిద్రపోవడానికి గల కారణాల్లో స్లీవ్ ఆస్నియా ఒకటిగా ఉంటుంది. దీంతో సంబంధం లేకుండా నోరు తెరిచి నిద్రపోతుంటారు. ముక్కు నుంచి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడితే నోటి నుంచి గాలి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే నోరు తెరిచి నిద్రపోతుంటారు.

నోరు తెరిచి నిద్ర పోయే వారికి ముక్కు లోపల రక్తనాళాలు రక్తంతో నిండిపోవంతో వాపు ఏర్పడుతుంది. దీంతో ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. దీనివల్ల నోరు తెరుచుకుని నిద్రపోతుంటారు. నోరు తెరిచి నిద్ర పోవడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారికి రాత్రిపూటనే కాకుండా పొద్దంతా కూడా వారు నోటి నుంచి శ్వాస తీసుకునే అవకాశం ఉంటుంది. రక్తపోటు పెరిగినప్పుడు కూడా వేగంగా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా నోటి నుంచి శ్వాస తీసుకుంటుంటారు.
అలర్జీలు ఏర్పడినప్పుడు కూడా నోటి నుంచి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అలర్జీలు వస్తాయి. ఆ సమయంలో శ్వాస ఎక్కువగా తీసుకునేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా నోరు తెరిచి శ్వాస తీసుకోవడం మామూలే. ఉబ్బసం ఉన్న వారు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి నోరుతెరిచి శ్వాస తీసుకోవడం సహజమే. దగ్గు, జలుబు సమస్యలు ఉన్న వారు కూడా ముక్కు నుంచి కాకుండా నోటి నుంచి శ్వాస తీసుకుంటారు. జలుబుతో పాటు సైనస్ వంటి వ్యాధి ఉన్న వారు కూడా నోటి ద్వారా గాలి తీసుకుంటుంటారు.

ఇలా నోరు తెరిచి నిద్రపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. కానీ నిద్ర పోయేటప్పుడు నోటితో కాకుండా ముక్కుతోని శ్వాస తీసుకోవడమే ఉత్తమం. లేదంటే మనకు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. శ్వాసలో ముక్కుతోని తీసుకుంటేనే ఆరోగ్యం ఉంటుంది. నోటితో తీసుకునే శ్వాసతో సైడ్ ఎఫెక్స్ట్ వచ్చే వీలుంటుంది. దీంతో గురక కూడా పెట్టే ప్రమాదం ఉంటుంది. దీని నుంచి బయట పడటానికి మనం పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నోరు తెరిచి నిద్రపోవడం అనేది వ్యాధిగానే గుర్తించాలి.