TRS MLAs Poaching Case: నేను చేసిందే అభివృద్ధి.. నేను పెట్టిందే పథకం.. నేను చెప్పినట్లే అంతా నడుచుకోవాలి.. కాదంటే తరిమి కొట్టాలి.. తెలంగాణ వ్యతిరేక ముద్ర వేయాలి. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నైజం. తప్పు చేసినా.. చేయలేదని, మాట తప్పినా తప్పలేదని తన మాటలతో నమ్మించలగడు. హామీ ఇచ్చినా ఇవ్వలేదని ధైర్యంగా చెప్పగలడు. ఇదంతా ఏడాది క్రితం వరకు నడిచింది. ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ దూకుడుతో కేసీఆర్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్రం రంగంలోకి దిగడంతో అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. అయితే ఓటుకు నోటు కేసులో చంద్రభాబును తెలంగాణ నుంచి తరిమినట్లు బీజేపీని తరమాలనుకున్నాడు. ఇందుకు ఎమ్మెల్యేలకు ఎర వ్యూహం ర చించారు. కానీ ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకునే ప్రమాదం పొంచిఉంది. తాజాగా కేసు సీబీఐ చేతికి వెళ్లడమే ఇందుకు నిదర్శనం.

మరో కీలక పరిణామం..
ఎమ్మెల్యేల ఎర కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు కాపీ అందుకున్న సీబీఐ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రంగంలోకి దిగబోతున్నట్లు సంకేతం ఇచ్చింది. కేసు వివరాలు అందించాలని లేఖలో కోరింది. ఇదే సమయంలో సింగిల్‌బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లిన ప్రభుత్వానికి డివిజన్ బెంచ్‌లో ఊరట లభించలేదు. సీబీఐ విచారణపై స్టే వస్తుందనుకుంటే.. వాయిదా మాత్రమే పడింది. శుక్రవారం దీనిపై నిర్ణయం వెలువడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వద్దన్న సీబీఐ వచ్చింది..
తెలంగాణలోకి సీబీఐ రావొద్దని సీఎం కేసీఆర్ జీవో తెచ్చారు. దానిని రహస్యంగా ఉంచారు. అంటే జరుగబోయే పరిణామాలను ఆయన ముందే ఊహించారా.. లేక ఎమ్మెల్యేల ఎర కేసు వ్యూహరచన, లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో సీబీఐ వస్తే తన బండారం భయటపడుతుందని భావించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కేసీఆర్ ఇచ్చిన జీవో సీబీఐ రాకుండా ఆపలేకపోయింది. రావొద్దనుకున్న సీబీఐ రానేవచ్చింది. అది కూడా ప్రభుత్వం కేసులోనే. దీంతో ఇప్పుడు అసలు గేమ్ మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రణమా… శరణమా..
తెలంగాణ ణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఏడాది కాలంగా అనేక ఎత్తులు వేసస్తున్నారు. కానీ అవన్నీ చిత్తవుతున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా ఇందుకు కారణం. లేకుంటే టీడీపీ తరహాలోనే బీజేపీ కూడా తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించేది. కేసీఆర్‌తో తలపడి నిలబడుతున్న తరుణంలో కేసీఆర్ రణం చేస్తారా.. శరణం కోరుతారా అన్న చర్చ జరుగుతోంది. ఏదైనా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు తర్వాత కీలక పరిణామం ఖాయంగా కనిపిస్తోంది.