Financial Problems: ప్రస్తుత కాలంలో ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఎంత సంపాదించినా చాలడం లేదు. కుటుంబ నిర్వహణ ఖర్చు అమాంతం రెట్టింపయ్యింది. దీంతో ఏం కొనాలన్నా కుదరడం లేదు. రూపాయి విలువ పడిపోవడంతో ఎంత సంపాదించినా పైసా నిలవడం లేదు. అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయ మార్గాలు తగ్గి వ్యయాలు పెరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఖర్చుల నుంచి బయట పడేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పు పుట్టింది అవ్వ అంటే కొంప మునిగింది కొడుకా అన్నట్లు అది మనకు కష్టాలే తెస్తుంది. నెలనెల వడ్డీలు చెల్లించలేక నానా బాధలు పడాల్సి వస్తోంది.

అప్పుల భారం నుంచి బయట పడాలంటే చాలా మంది దేవుళ్లను మొక్కుతుంటారు. తమ అప్పులు తీర్చే మార్గం చూపించాలని వేడుకుంటుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ అప్పులు తీరడం లేదని తెగ విచారం వ్యక్తం చేస్తుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో దీనికి సంబంధించిన ఓ చక్కని పరిష్కారం ఉంది. వాస్తు శాస్త్రం రీత్యా కూడా అప్పుల నుంచి బయట పడేందుకు కొన్ని చిట్కాలు ఉంటాయి. కానీ వాటిని ఎవరు పట్టించుకోవం లేదు. చిన్నపాటి రెమెడీలు అయినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా పాటిస్తే ఫలితాలు రావడం ఖాయం.
కొంతమంది వీటిని మూఢనమ్మకం అనొచ్చు. కానీ పాటిస్తే ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఆర్థిక ఇబ్బందులకు వాస్తు దోషమే కారణంగా చెబుతుంటారు. మన ఇంట్లో అదే పనిగా నీరు వృథా చేస్తే డబ్బుల లోటు వస్తుందని విశ్వసిస్తారు. ఆర్థిక కష్టాలు రాకుండా ఉండాలంటే నీళ్ల ట్యాంకును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు దోషానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. నీళ్ల ట్యాంకు శుభ్రంగా ఉండకపోతే ఆర్థికంగా లోటు స్పష్టంగా కనిపిస్తుంది. బాత్ రూం కూడా క్లీన్ గా ఉంచుకోవాలి.

బాత్ రూంలో ఎప్పుడు నీలిరంగు బకెట్ ఉంచుకోవాలి. అందులో నీళ్లు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా బకెట్ లో నీరు లేకుండా వట్టిది ఉంచొద్దు. అలా ఉంచితే మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. బకెట్ లో నీరు నిలువ ఉంటే భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు మన మీద ఉంటుంది. స్నానాల గదిలో నీలి రంగు బకెట్ ను ఉంచుకోవడమే శ్రేయస్కరం. బకెట్ లో కొద్దిగా నీళ్లు ఉండేలా జాగ్రత్త పడితే ఆర్థిక సమస్యలు రావని తెలుసుకోవాలి. దాని కోసమే మనం పాటుపడాలి. అప్పుడే మనకు డబ్బుకు లోటుండదు.