Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… మెగాస్టార్ తమ్ముడి గా ఇండస్ట్రీకి ఏంటి ఇచ్చిన పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో తన దైన రీతిలో సక్సెస్ లను సాధించాడు. ఇక పవర్ స్టార్ గా తనదైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు పాలిటిక్స్ లో చాలా బిజీగా కూడా కొనసాగుతున్నాడు. అలాగే అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలు చేయడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన స్టార్ హీరోగా స్టార్ స్టేటస్ ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ దేవరకొండ లాంటి నటుడు కూడా అర్జున్ రెడ్డి సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించుకున్నాడు. అప్పటి నుంచి ఆయన తనదైన రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడని అందరూ అనుకున్నప్పటికి ఆ తర్వాత చేసిన సినిమాలేవి ఆశించిన మేరకు విజయాలను సాధించకపోవడంతో ఆయన స్టార్ట్ డమ్ అందుకోలేకపోతున్నాడు. ఇక స్టార్ స్టేటస్ ని పక్కన పెడితే ఆయన ఒక సక్సెస్ ని కొట్టడానికి కూడా చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా 100 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కుతు ఉండడంతో ఈ సినిమా ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధిస్తుందంటూ విజయ్ దేవరకొండ భారీ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఇక దాంతోపాటుగా మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయిన విజయ్ సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు.
మరి ఇకమీదట అయిన ఆయన స్టోరీ సెలక్షన్ లో గాని తన బిహేవియర్ లో గాని మార్పు వస్తే మాత్రం ఆయన స్టార్ స్టేటస్ ను ఈజీగా అందుకుంటాడు అంటూ మరికొంతమంది కామెంట్లు చేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో రాణించడం అంటే అంత ఈజీ అయితే కాదు. మంచి సినిమాలను చేస్తూనే బిహేవియర్ చాలా పద్ధతిగా ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆ హీరో ని ఓన్ చేసుకొని ఆయన మన హీరో అంటూ అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ఇక ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టోరీ సెలక్షన్ తో పాటు తన బిహేవియర్ ని కూడా భారీగా మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి మరి తన తదుపరి సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…