Diwali Bumper Offer: దీపావళి బంపర్ ఆఫర్..ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ తగ్గింపు..

పండుగల సీజన్ సందర్భంగా ఏదైనా వెహికల్ కొనాలని చూస్తారు. ముఖ్యంగా ఆటోమోబైల్ రంగానికి ఈ సీజన్ కలిసి వస్తుంది. అయితే కంపెనీల మధ్య పోటీ కారణంగా ఒక్కోసారి వినియోగదారులను ఆకర్షించడానికి వాహనాల ధరలు తగ్గించాల్సి వస్తుంది. తాజాగా దీపావళి సందర్భంగా కొన్ని కంపెనీలు ధర తగ్గించి వెహికల్స్ ను విక్రయిస్తున్నాయి

Written By: Srinivas, Updated On : October 30, 2024 11:46 am

Diwali-Dhamaka

Follow us on

Diwali Bumper Offer: పండుగల సీజన్ సందర్భంగా ఏదైనా వెహికల్ కొనాలని చూస్తారు. ముఖ్యంగా ఆటోమోబైల్ రంగానికి ఈ సీజన్ కలిసి వస్తుంది. అయితే కంపెనీల మధ్య పోటీ కారణంగా ఒక్కోసారి వినియోగదారులను ఆకర్షించడానికి వాహనాల ధరలు తగ్గించాల్సి వస్తుంది. తాజాగా దీపావళి సందర్భంగా కొన్ని కంపెనీలు ధర తగ్గించి వెహికల్స్ ను విక్రయిస్తున్నాయి. వీటిలో స్కూటర్ కంపెనీలు గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈవీలు అందుబాటులోకి రావడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సిటీల్లో ఉండేవారికి ఈ వాహనాలు అనుగుణంగా ఉంటున్నాయి. ఈ డిమాండ్ ను పసిగట్టిన కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి కొన్నింటిపై పండుగ సందర్భంగా ధరలను తగ్గించారు. మరి ఆ స్కూటర్లు ఏవో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

ప్రస్తుత కాలంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కు స్కూటర్ నిత్యావసరంగా మారింది. ఈ నేపథ్యంలో లో బడ్జెట్ లో ఈవీని కొనాలను చూస్తుంటారు. ఈ నేపథ్యంలో అత్యంత తక్కువ ధరకు విక్రయించే కంపెనీల్లో ‘లెక్ట్రిక్స్’ ప్రధానంగా నిలుస్తుంది. ఈ కంపెనీకి చెందిన LXS G2.0 బెస్ట్ ఈవీగా నిలుస్తోంది. ఈ మోడల్ లో 2.3 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 98 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని దీపావళి ఆఫర్ కింద రూ. 1,17,352తో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన మరో మోడల్ LXS G3.0 కూడా ఆకట్టుకుంటోంది. ఇందులో బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ సదుపాయం కలగనుంది. 18 A ఛార్జర్ ను ఉపయోగించి మూడు గంటల్లో పూర్తి చార్జింగ్ చేయొచ్చు.

ప్రముఖ కంపెనీ OLA SI X ను దీపావళి ఆఫర్ ను కలిగి ఉంది. ఇందులో 2 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 151 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని ప్రస్తుతం మార్కెట్లో 87,796 తో విక్రయిస్తున్నారు. ఈ కంపెనీకి చెందిన మోడళ్లలో ఇదే నెంబర్ వన్ గా నిలుస్తోంది. ఇక ఇదే కంపెనీకి చెందిన OLA S1X 3KW, S1X 4Kw వంటి వాహనాలు కూడా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. అయితే ఇవి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. దీపావళి సందర్భంగా వీటికి ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. అయితే ఓలాకు చెందిన అన్ని స్కూటర్లు 110 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

నేటి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. అయితే కొన్ని కంపెనీలకు చెందిన వాహనాలు అధికధరలను కలిగి ఉన్నాయి. కానీ పండుగల సందర్భంగా ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. ఈవీ స్కూటర్ కొనాలని అనుకుంటున్న వారికి ఇదే మంచి సమయం అని ఆటోమోబైల్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే వారి అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ, మైలేజ్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు వాహానాల కొనుగోలు చేసే సమయంలో మిగతా ఛార్జీలు విధిస్తున్నారా? లేదా? అనేది గుర్తుంచుకోవాలి. కొందరు ధర తగ్గింపు అని చెప్పినా.. వివిధ చార్జీలను వసూలు చేస్తారు.