https://oktelugu.com/

America : అమెరికాలో బ్యాలెట్‌ బాక్సులకు నిప్పు.. గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా వారం రోజులే గడువు ఉంది. దీంతో అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా బ్యాలెట్‌ బాక్సులకు నిప్పు పెట్టారు

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 30, 2024 / 11:55 AM IST

    America

    Follow us on

    America :  అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరుగనున్నాయి. ఈమేరు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రచారంతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో కొంత మంది దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎన్నికల బ్యాలెట్‌ డ్రాప్‌ బాక్సులకు నిప్పు పెట్టారు. సోమవారం(అక్టోబర్‌ 28న) జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో మూడు బ్యాలెట్‌ డ్రాప్‌ బాక్సులు కాలిపోయాయి. వాషింగ్‌టన్, వాంకోవర్‌లో పెద్ద సంఖ్యలో కాలిపోయినట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్‌ 8న వాంకోవర్‌లో పెద్ద సంఖ్యలో దగ్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎలాంఇ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దుండగులు ఉద్దేశపూర్వకంగానే బ్యాలెట్‌ డ్రాప్‌ బాక్సులకు నిప్పు పెడుతున్నట్లు పోర్ట్‌ండ్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ చీఫ్‌ కమాండర్‌ మెక్‌మిలన్‌ తెలిపారు.

    కేసులు నమోదు..
    వాషింగ్‌టన్, ఒరెగాన్‌ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై ఓటింగ్‌ యంత్రాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాంగ్‌కోవార్‌లో సోమవారం బ్యాలెట్‌ డ్రాప్‌ బాక్కుల నుంచి పొగలు వస్తుండడంతో పోలీసులు పక్కనే ఉన్న అనుమానాస్పద పరికరాన్ని తొలగించారు. ఒరెగాన్‌లోని పోర్ట్‌ండ్‌లో బ్యాలెట్‌ బాక్సులో సోమవారం ఉదయం ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో మడు బాక్సులు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో ఓటు వేసినవారు మరోసారి ఓటు వేసేలా సంప్రదిస్తామని కౌంటీ ఎన్నికల డైరెక్టర్‌ తెలిపారు.

    ఓటు లెక్కలోకి రాకుంటే..
    తమ బ్యాలెట్‌ లెక్కలోకి వచ్చిందో లేదో స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. పరిగణనలోకి వస్తే ఎలాంటి సమస్య ఉండదు. రాకపోతే ప్రత్యామ్నాయం కోసం అభ్యర్థించాలని వాషింగ్‌టన్‌ సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ కార్యాలయం ఓటర్లకు సూచించింది. ఇక వాంగ్‌కోవర్‌లో డెమొక్రటిక్‌ ప్రతినిధి మేరీ గ్లూసెన్‌కంప్‌ పెరెజ్, రిపబ్లికన్‌ ప్రత్యర్థి జోకెంట్‌ బరిలో ఉన్నారు. బ్యాలెడ్‌ డ్రాప్‌ బాక్సులకు పోలీసులు రాత్రి రక్షణగా ఉండాలని గ్లూసెన్‌కంప్‌ పెరెజ్‌ డిమాండ్‌ చేశారు.

    ఒకరి అరెస్ట్‌..
    అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉన్న అమెరికాలో కూడా బ్యాలెట్‌ బాక్సులు కాలిపోవడం ఇప్పుడు చర్చనీయంశమైంది. ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై ఒకసారి దాడి జరిగింది. రెండుసార్లు విఫలయత్నం జరిగింది. డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. తాజాగా బ్యాలెట్‌ డ్రాప్‌ బాక్సులకు నిప్పు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు అమెరికా రక్షణ వ్యవస్థపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. బ్యాలెట్‌ డ్రాప్‌ బాక్సులు దమనం చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 20 వరకు బ్యాలెట్‌ బాక్సులు ధ్వంసం అయినట్లు అమెరికా మీడియా తెలిపింది.