Zodiac Signs: సౌర వ్యవస్థలో నాలుగవ గ్రహం కుజుడు. అంగారకుడు, అరుణగ్రహం అనే పేరు ఉన్న ఈ గ్రహం నాలుగో స్థానంలో ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేష రాశికి అధిపతిగా కుజుడు ఉంటారు. దేవతలకు సైన్యాధిపతిగా కూడా వ్యవహరిస్తారు. కుజుడు గతేడాది అక్టోబర్లో కర్కాటక రాశిలో ప్రవేశించాడు. ఏడాదిలో మిథున రాశిలో ప్రవేశించాడు. అయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి మరోసారి కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. ఈ సందర్భంగా మూడు రాశులపై ప్రభావం పడనుంది. ఆ రాశుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ఇంతకీ ఆ ప్రభావం పడే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కుజుడు ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల మేషరాశిపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మేషరాశిపై అధిపత్యము చలాయించే కుజుడు ఈ రాశి వారికి ఏప్రిల్ 3 నుంచి అన్ని శుభసంకేతాలే తెలుపనున్నారు. ఈ రాశి వారు ఇప్పటివరకు ఆర్థిక సమస్యలతో బాధపడితే వాటి నుంచి బయటపడతారు. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంటికి అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులైన కారు, గృహం వంటివి కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. అయితే కుటుంబ సభ్యుల్లో విభేదాలు ఏర్పడతాయి. వీటిని తొలగించడానికి పరిష్కారాలను చూస్తారు.
కుజుడు రాశి మారడం వల్ల కన్యారాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన లాభం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల మద్దతుతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
తులా రాశిపై కుజ గ్రహం ప్రభావం పడనుంది. ఈ రాశి వ్యాపారాలకు ఈనెల బాగా కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ అదృష్టం ఉంటుంది. ప్రతిరోజు సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆర్థికంగా స్థిరపడతారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు మితిమీరుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో వ్యాపారం చేయడం అంత మంచిది కాదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళనగా ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.