Regular Crackers Vs Green Crackers: హిందువుల ముఖ్య పండుగ అయిన దీపావళి రోజున ఇంటింటా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఆ తర్వాత లక్ష్మి పూజలు చేస్తారు. అనంతరం దుష్టశక్తులను దూరం చేయడానికి బాణాసంచా కాలుస్తూ ఉంటారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు. అయితే కొందరికి బాణసంచా కాల్చడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇవి అధిక శబ్దం ఇవ్వడంతో పాటు.. విషపూరితమైన కాలుష్యాన్ని అందిస్తాయి. టపాసుల నుంచి వెలువడే కాలుష్యంతో వాతావరణంలో అనేక మార్పులు వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎదురవడంతో అక్కడ బాణ సంచాను నిషేధించారు. కానీ ఇటీవల గ్రీన్ కాకర్స్ కాల్చవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అసలు గ్రీన్ కాకర్స్ కాల్చడం వల్ల కాలుష్యం వెలువడదా?
దీపావళి పండుగ రోజు కాల్ చెయ్ క్రాకర్స్ లలో అనేక రసాయనక పదార్థాలు ఉంటాయి. సాధారణ క్రాకర్స్ లో బేరియం, నైట్రేట్, పొటాషియం, సల్ఫర్ పదార్థాలతోపాటు అల్యూమినియం లోహం వాడుతారు. ఇవన్నీ కలిపి ఒక దానిలో మిశ్రమం చేస్తారు. అయితే వీటిని కాల్చినప్పుడు అధిక మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతాయి. ఇవి వాతావరణంలో కలిసిపోయి స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తాయి. అలాగే టపాసులు పీల్చినప్పుడు 160 డేసిఫిల్స్ కంటే ఎక్కువగా శబ్దం వస్తుంది. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా ఉంటాయి. హార్ట్ ఎటాక్ సమస్య ఉన్న వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో బాణాసంచా పేల్చడాన్ని నిషేధించారు.
అయితే ఇటీవల గ్రీన్ కాకర్స్ కాల్చుకోవచ్చని అనుమతి ఇచ్చారు. అసలు గ్రీన్ కాకర్స్ అంటే ఎలా ఉంటాయి? Council of Scientific and Industrial Research (CSIR) ఆధ్వర్యంలో National Environmental Engineering Research Institute (NEERI) గ్రీన్ కాకర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణ క్రాకర్స్ లో ఉపయోగించే రసాయనాలు కాకుండా ఇందులో తక్కువగా ఉపయోగించి తయారు చేస్తారు. గ్రీన్ కాకర్స్ పేలినప్పుడు నీటి బిందువులు వెదజల్లుతాయి. దీంతో క్రాకర్స్ నుంచి వెలబడిన పొగ గాలిలో కలిసిపోకుండా అడ్డుకుంటుంది. అలాగే గ్రీన్ కాకర్స్ నుంచి వెలువడే పొగ తక్కువగా ఉంటుంది. అయితే సాధారణ క్రాకర్స్ తో పోలిస్తే గ్రీన్ కాకర్స్ వల్ల 30 శాతం వరకు కాలుష్య ఉద్గారాలు తగ్గించినట్లు అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే గ్రీన్ కాకర్స్ నుంచి వెలువడే శబ్దం 110 నుంచి 125 వరకు ఉంటుందని అంటున్నారు. దీంతో శబ్ద కాలుష్యం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే సాధారణ క్రాకర్స్ కంటే గ్రీన్ కాకర్స్ పూర్తిగా కాలుష్యాన్ని వెదజల్లలేము అని చెప్పలేం. కానీ వాటికంటే తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు గ్రీన్ కాకర్స్ వాడడం వల్ల కొంతవరకు కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు. అయితే గ్రీన్ కాకర్స్ కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్ చూసిన తర్వాత కొనుగోలు చేయాలి.