BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై అంశంపై జరుగుతున్న నాటకాన్ని ప్రజలందరూ సునిశితంగా గమనిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు. దీంతో కాంగ్రెస్ నాటకం వెనుక రాహుల్ గాంధీ ఉన్నారు. తెలంగాణను ఒక ప్రయోగ శాలగా మారుస్తున్నారు. దేశవ్యాప్తంగా సమాజంలో చిచ్చు పెట్టడానికి.. కులాల మధ్య తగాదాలు పెట్టడానికి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రాహుల్ గాంధీ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. దీన్ని అమలు చేసే నైతికత ఎక్కడ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరోసారి అనిశ్చితిలో పడింది. దీనికి ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ల అంశం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9పై హైకోర్టు స్టే విధించడంతో, మొత్తం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీల జనాభా లెక్కల ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. ఈ పరిమితిని దాటుతున్నందున హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. పాత పద్ధతిలోనే (50 శాతం పరిమితికి లోబడి) ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.
బీసీలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, తాము బీసీల సంక్షేమం కోసమే పోరాడుతున్నామని పాలకపక్షం వాదిస్తోంది. ఈ మొత్తం పరిణామం బీసీల సామాజిక న్యాయం కోసం చేస్తున్న ‘నాటకం’గా మారిందని, ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ల నాటకంలో ఎన్నికలు వాయిదా వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
