Keylogger: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న రోజులు ఇవి. ఉదయం కొనుగోలు చేసే పాల ప్యాకెట్ నుంచి రాత్రి వేసుకునే మాత్రల దాకా ప్రతి చెల్లింపులోనూ అన్ లైనే. అందుకే మన దేశం అభివృద్ధి చెందిన దేశాలను మించిపోతుంది.. అయితే ఇదంతా కాయిన్ కు ఒకవైపు మాత్రమే.. మరోవైపు అంతులేని మోసం ఉంది.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇతరులను తెలివిగా మోసం చేసే కుట్ర కూడా ఉంది.. ఇలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి కూడా మన చేతిలోనే ఉన్నాయి. వాటిని పాటిస్తే మన సమాచారం భద్రం, ఖాతాల్లో ఉన్న మన డబ్బులూ భద్రం. ఇంతకీ ఆ టెక్నాలజీ కిటుకులు ఏంటో మీరూ చదివేయండి.
కీ లాగర్
కీ లాగర్… మనకు తెలియకుండానే మనం కీ బోర్డుపై టైప్ చేస్తున్న ప్రతి సమాచారాన్నీ హ్యాకర్స్‌కు అందించే చిన్నపాటి ప్రోగ్రామ్. మనకు తెలియకుండానే మన కంప్యూటర్‌లో చేరిపోయే దీంతో కీలక సమాచారం హ్యాకర్స్ చేతికి అంది మనం తీవ్రంగా నష్టపోతాం. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగించే సమయం… అందునా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపే సమయంలో కీలక సమాచారాన్ని కీ బోర్డుపై మనం టైప్ చేస్తాం. అదే సమయంలో కీ లాగర్ ఆ సమాచారాన్ని స్టోర్ చేసి హ్యాకర్స్‌కి చేరవేస్తుంది. దీంతో సైబర్ మోసాలకు గురవుతాం. అయితే కీ లాగర్ నుంచి రక్షణ పొందేందుకు ఎన్నో రక్షణ మార్గాలున్నాయి. ఇంటర్నెట్ ద్వారా అవసరాలను బట్టి కీ బోర్డు ఉపయోగించి ముఖ్యమైన సమాచారాన్ని ఫీడ్ చేస్తుంటాం. అందులో వ్యక్తిగతంగా పాస్‌వర్డ్స్, క్రెడిట్ కార్డు సమాచారం, ఆన్‌లైన్ బ్యాకింగ్ వంటి అనేక రకాల సేవలను నిర్వహిస్తున్నాం. కంప్యూటర్ ద్వారా నిర్వహించే పనుల్లో కీలక సమాచారాన్ని తస్కరించే చిన్నపాటి ప్రోగ్రామ్స్‌నే కీ లాగర్స్ అంటారు. డేటాను, నెట్‌వర్క్‌ను పాడు చేసే ప్రోగ్రామ్స్ చేస్తున్న హ్యాకర్స్ సంఖ్య పెరుగుతున్నట్టే ఇతరుల సమాచారాన్ని ఇలా కీ లాగర్స్ ద్వారా తస్కరించే హ్యాకర్స్ సంఖ్యా పెరుగుతోంది. సైబర్ ప్రపంచంలో కీలక సమాచారాన్ని తస్కరించే వారి కోసం సాంకేతికతను వినియోగించుకునే వారు అప్రమత్తంగా ఉండాలి.
ప్రతిదీ కనెక్ట్ అయి ఉంటుంది
సైబర్ ప్రపంచంలో ప్రతిదీ కనెక్టయి ఉంటుంది. వినియోగించే కీ బోర్డు ద్వారా అందించే ప్రతి సమాచారాన్నీ స్టోర్ చేసుకుని హ్యా కర్స్‌కు అందించడంలో కీ లాగర్స్ కీలకం. వీటి లో రెండు రకాలు. కంప్యూటర్ ప్రోగ్రామ్ సాఫ్ట్‌వేర్ కీ లాగర్స్, హార్డ్‌వేర్ కీ లాగర్స్. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్లో పనిచేసే సమయంలో అధిక మొత్తంలో సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. ఉదాహరణకు నెట్ బ్యాకింగ్ అకౌంట్ కలిగి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా బ్యాకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలంటే తొలుత లాగిన్ కావాలి. ఇందుకోసం నెట్ బ్యాకింగ్‌కు సంబంధించిన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ అందించాలి. ఆన్‌లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు క్రెడిట్ కార్డు సమాచారాన్ని ఇస్తుంటారు. దీంతో పాటు ఫేస్‌బుక్ అ కౌంట్‌లోకి లాగిన్ కావాలంటే పాస్‌వర్డ్ టైప్ చేయాలి. మెయిల్స్ కోసం ఇలా అనేక సందర్భాల్లో ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుం టాం. ఈ సమాచారాన్ని కీ బోర్డులో ఎంటర్ చేసే సమయంలోనే కీ లాగర్స్ తస్కరించి స్టో ర్ చేసుకుంటాయి. సిస్టమ్ నుంచి ఆన్‌లైన్ బ్రౌ జింగ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్‌వేర్ కీ లాగర్స్ ద్వా రానే సమాచారాన్ని హాకర్స్ పొందుతుంటారు. కీస్ట్రోక్ లాగింగ్ ద్వారా సమాచారాన్ని తస్కరించే వాటినే కీ లాగర్స్ అంటారు. హార్డ్‌వేర్ పరంగానూ కీలాగర్స్‌ను సెటప్ చేస్తారు. వీటి ని కీ బోర్డు ద్వారా గానీ సిస్టమ్ యూనిట్‌కు వెనుకవైపు ప్రత్యేకంగా హార్డ్‌వేర్‌కి కీలాగర్స్ ఉంచుతారు. ఇవి ప్రతి ఒక్కరూ అందించే స మాచారాన్ని నిల్వ చేస్తాయి. మనం వినియోగించే కంప్యూటర్‌ను, నెట్‌సెంటర్‌ల్లోని కంప్యూటర్‌ను గమనించి వినియోగించడం ఉత్తమం. హార్డ్‌వేర్ కీ లాగర్స్‌ను వినియోగించే వారికి తె లియకుండానే కీ బోర్డుకు కనెక్ట్ చేసి మనం ఎంట్రీ చేసే సమాచారాన్ని తస్కరిస్తుంటారు. టెక్నికల్‌గా చూస్తే కీలాగర్ అంటే కోడ్ మాత్రమే. ఇది కీస్ట్రోక్స్‌ను నిల్వ చేసుకుంటుంది. ఇవి ట్రోజాన్ హార్స్ గానీ మాల్‌వేర్‌లో ఒక భాగంగా ఉండి కంప్యూటర్‌లోకి చేరుతాయి.
ఎన్నో మార్గాలు ఉన్నాయి
కంప్యూటర్‌లోకి చేరేందుకు అనేక మార్గాలున్నాయి. మీరు వినియోగించే కంప్యూటర్‌లో మీకు తెలియకుండానే వేరే వ్యక్తులు వీటిని ఇన్‌స్టాల్ చేయవచ్చు. అందువల్ల రిమోట్ యాక్సెస్‌లో ఉండే సమయాల్లో జాగ్రత్త వహించాలి. మీరు వినియోగిసిస్తున్న బ్రౌజర్ శక్తివంతంగా ఉండదు. వెబ్ బేస్డ్ ఎలాక్స్ జరిగినప్పుడు గానీ మాసిసియస్ కోడ్‌ను కలిగి ఉండే వెబ్‌సైట్‌ను దర్శించినప్పుడు ఈ కోడ్ సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ అవుతుంది. రిమూవబుల్ మీడియా గానీ యుఎస్‌బీ డ్రైవ్స్ ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. కొన్ని రకాల సాఫ్ట్‌వేర్స్ బైండర్స్ వీటి ద్వారా హ్యాకర్స్ కీ లాగర్ కోడ్‌ను మంచి ప్రోగ్రామ్‌కు ఎటాచ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక మంచి గేమ్ ఉందనుకోండి దీనికి బైండర్ ద్వారా కీలాగర్‌ను ఎటాచ్ చేసి వెబ్ ద్వారా మంచి గేమ్ ఉచితంగా ఉంది ట్రై చేయండనే మెసేజ్ పంపుతారు. గేమ్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే కీలాగర్ ఇన్‌స్టాల్ అవుతుంది. తర్వాత పనిచేయడం ప్రారంభించి ముఖ్యమైన సమాచారాన్ని వెబ్ ద్వారా హ్యాకర్స్‌కు చేరవేస్తుంది. పీర్ టూ పీర్ నెట్‌వర్క్‌ల ద్వారా కూడా ఇటువంటి కోడ్స్ ఇన్‌స్టాల్ అవుతాయి. నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించుకుని ఇటువంటివి సులువుగా వ్యాప్తి చెందుతాయి. కీ లాగర్స్ నెట్‌లోని మంచి ప్రోగ్రామ్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది
ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. కీలాగర్స్ నుంచి సిస్టమ్‌ను కాపాడుకోవచ్చు. సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిన వాటిని మాన్యువల్‌గా తొలగించలేం. ఐతే మాలిసియస్ కోడ్ స్కానింగ్ నిర్వహించే వెబ్‌సైట్ ద్వారా సిస్టమ్‌లో కోడ్ ఉంటే తొలగించవచ్చు. దీనికోసం వైరస్‌టోటల్.కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా మాలిసియస్ స్కానింగ్ నిర్వహించవచ్చు. ఇంటర్నెట్ వినియోగంతో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్‌ను ప్రతిఒక్కరూ కలిగి ఉంటున్నారు. అందువల్ల షేర్డ్ కంప్యూటర్స్ నుంచి లాగిన్ అయ్యే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సైబర్ కేఫ్ నుంచి నెట్‌ను వినియోగించే సమయాల్లో క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్ వంటివి ఉపయోగించకపోవడం ఉత్తమం. సిస్టమ్‌లో యాంటీ వైరస్ కంటే కంప్లీట్ ఇంటర్నెట్ సెక్యూరిటీని అందించే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఏదైనా వెబ్‌సైట్స్ మాలిసియస్ కోడ్ కలిగి ఉంటే వెంటనే వచ్చేయాలి. అనవసర ప్రోగ్రామ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. ఉపయోగపడే మంచి ప్రోగ్రామ్స్‌నే (మంచి రిప్యూటేషన్ ఉన్న వాటిని) మాత్రమే డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలి. వీటితో పాటుగా యాంటీ మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్స్, ఫైర్‌వాల్స్ సెటప్ చేసుకోవాలి. సిస్టమ్‌కు తగిన ప్రొటెక్షన్ లేకపోతే కీలాగర్స్ నుంచే కాకుండా వైరస్ నుంచి కూడా ప్రమాదం లేకపోలేదు.
ఇవి తప్పకుండా పాటించాల్సిందే
వ్యక్తిగత కంప్యూటర్ బయోస్ పాస్‌వర్డ్‌తో పాటు ముఖ్యమైన సమాచారాన్ని ఎన్‌క్రిఫ్ట్ చేసుకోవడం ఉత్తమం. ఆన్‌స్ర్కీన్ కీ బోర్డును ఉపయోగించడం వల్ల కీబోర్డు నుంచి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా మౌస్‌తో క్లిక్ చేస్తూ పాస్‌వర్ట్‌లను ఇతర సమాచారాన్ని ఎంటర్ చేసుకోవచ్చు. ముఖ్యమైన సమాచారాన్ని ఎంట్రీ చేసే సమయంలో ఈ కీబోర్డును వినియోగించండి. దీంతో కీలాగర్స్‌కు మన సమాచారం దొరకడం కష్టం. ఇటువంటి ఫీచర్స్‌ను బ్యాకింగ్ వెబ్‌సైట్స్ ఇటీవల అందిస్తున్నాయి. అకౌంట్స్ వివరాలను రికవరీ చేయడం కోసం అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో ఇచ్చే వివరాలను గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు సెక్యూరిటీ, నిక్‌నేమ్, క్వశ్చన్, వంటి వివరాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లినక్స్ వంటి శక్తివంతమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలి. ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌ల్లో కీలాగర్స్ ఎటాక్స్ దుర్లభం. ప్రపంచంలో విండోస్ యూజర్స్ అధికంగా ఉండటంతో విండోస్ ఓఎస్‌పై అటాక్స్ జరిగే అవకాశాలు ఎక్కువ. హ్యాకర్స్ ఇటువంటి పీసీలపైనే దృష్టి పెడతారు. ఎప్పటికప్పుడు బ్రౌజర్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఈ బ్రౌజర్ ద్వారా ఎంట్రీ చేసే ప్రతి సమాచారం నిల్వ అయి ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్రౌజర్ హిస్టరీని క్లీన్ చేయాలి. వ్యక్తిగత కంప్యూటర్‌లో తగిన సెక్యూరిటీ ఉందంటేనే మీరు ఎంట్రీ చేసే సమాచారాన్ని నిల్వ చేసుకోండి. దీనికోసం లాగిన్ అయ్యే ప్రతిసారీ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు.
ఆఫ్ లైన్ లో ఉన్నపుడు
కీలాగర్స్ ఆఫ్‌లైన్లోనూ, ఆన్‌లైన్లో ఉన్నప్పుడు పనిచేస్తాయి. మనం వినియోగించే కంప్యూటర్‌లో మనకు తెలియకుండానే సిస్టమ్‌లో నిల్వ ఉన్న కీ లాగర్ ప్రోగ్రామ్స్ మనం ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడూ మనం ఎంట్రీ చేసే సమాచారాన్ని టెంపరరీ ఫైల్స్‌లో నిల్వ చేస్తాయి. అదే విధంగా ఆన్‌లైన్లో ఉన్పప్పుడూ సమాచారాన్ని నిల్వ చేసుకుంటూ నిర్దేశించిన హ్యాకర్స్ అడ్రస్‌కు పంపుతాయి. సాధారణంగా సిస్టమ్‌పై సర్ఫింగ్ చేస్తున్నప్పుడు గానీ డౌన్‌లోడింగ్ చేస్తున్నప్పుడు ఇవి యాక్టివ్‌గా ఉండవు. ఎప్పుడైతే ఈ మెయిల్, ఫేస్‌బుక్, నెట్ బ్యాకింగ్ వంటి వాటిలోకి లాగిన్ అవుతారో అప్పుడు యాక్టివేట్ అవుతాయి. కీలకమైన సమాచారాన్ని స్టోర్ చేసుకుంటాయి. గతంలో కీలాగర్స్ కోసం ప్రోగ్రామ్స్ చేయాలంటే చాలా కష్టపడేవారు. హ్యాకర్స్ పెద్దమొత్తంలో కోడింగ్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. సాంకేతికతలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అనేక బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ప్రోగ్రామింగ్ లాగ్వేంజీలు కలిగి ఉంటున్నాయి.
తొలుత కోడ్ రాయాలి.
కీలాగర్స్ అనే ప్రోగ్రామ్స్ లోడ్ కావడానికి తొలుత కోడ్ రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ గానీ ఆఫ్‌లైన్ గానీ ట్రేసింగ్ చేయడం కోసం మరో కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. విండో ట్రేసింగ్, కీ బోర్డు క్యారెక్టర్స్ క్యాప్చరింగ్, వంటి వాటి కోసం కోడ్ రాసి కీ లాగర్స్‌కు రూపకల్పన చేస్తారు. వీటిని వెబ్ ద్వారా స్ర్పెడ్ చేసి పలు సిస్టమ్స్‌లోని సమాచారాన్ని తస్కరిస్తారు.