Ram Charan- Upasana Daughter: హీరో రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇది పదేళ్ల నిరీక్షణ. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. తాతయ్య చిరంజీవి మీడియా వేదికగా తన ఆనందం తెలియజేశారు. ఈ మధ్య కాలంలో తమ కుటుంబంలో జరిగిన శుభాలన్నీ ఉపాసన కూతురు వలెనే అన్నారు. గొప్ప ఘడియల్లో పుట్టిందని అంటున్నారు. మంగళవారం రోజు మా ఇష్ట దైవం హనుమాన్ అశీసులతో అమ్మాయి పుట్టిందని ఆయన సంతోషం వ్యక్తపరిచారు.
ఈ క్రమంలో రామ్ చరణ్ వారసురాలు ఇంత పెద్ద కోటీశ్వరురాలో చర్చకు వచ్చింది. ఒక అంచనా ప్రకారం రామ్ చరణ్-ఉపాసన దంపతుల ఆస్తి విలువ రూ. 2500 కోట్లు. అందులో అధిక భాగం ఉపాసన ఆస్తి ఉంటుంది. ఉపాసన ఆస్తి వెయ్యి కోట్లకు పైమాటే అంటున్నారు. ఉపాసన దోమకొండ సంస్థానం వారసురాలు. అపోలో చైర్మన్ సి. ప్రతాపరెడ్డి మనవరాలు. ఆయన దేశంలోనే అత్యంత గొప్ప ధనవంతుల్లో ఒకరు. ఆయన ఆస్తి విలువ రూ. 21000 కోట్లు.
ఇక అపోలో గ్రూప్ మార్కెట్ వాల్యూ రూ. 70000 కోట్లు ఉంటుంది. రామ్ చరణ్ కి చిరంజీవి ద్వారా వచ్చిన ఆస్తి, ఆయన సంపాదించినది పక్కన పెడితే తల్లి ఉపాసన ద్వారా సంక్రమించే ఆస్తి వేల కోట్లు ఉంటుంది. అదన్నమాట సంగతి. అన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టే రామ్ చరణ్ ప్రత్యేక విమానం కలిగి ఉన్నారు. ఆయన కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి.
అలాగే ఉపాసన కూతురు జాతకం చూసిన జ్యోతిష్యులు ఆమె చాలా గొప్పవారు అవుతారంటున్నారు. కీర్తి, సంపద విషయంలో తల్లిదండ్రులను మించిపోతుందట. ఆమె గొప్ప ఘడియల్లో పుట్టిందంటున్నారు. 2012 ఉపాసన-రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ పెళ్లి. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో ఘనంగా నిర్వహించారు. ఉపాసన అపోలో వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఆమె మరికొన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు.