Housewife Profession: ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. చదువుకున్న వారికి చదువులేని వారికి యూత్ కి, ముసలి వారికి ఇలా ప్రతి ఒక్కరికి వారి నైపుణ్యాలను బట్టి ఉద్యోగాలు ఉంటాయి. కొన్ని ఆఫీస్ లలో కొన్ని కంపెనీలలో లేదంటే ప్రముఖుల ఇంట్లో పసిపిల్లలను, లేదా ముసలి వారిని చూసుకోవడానికి ఇలా చాలా ఉద్యోగాలు ఉంటాయి. కష్టపడాలి అనుకోవాలి గానీ పని దొరకడం సులభమే.. కానీ కాస్త కష్టపడాలి. అయితే ప్రతి జాబ్ కు జీతం పెరుగుతుంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంటుంది. కానీ ఒక ఉద్యోగానికి మాత్రం పని పెరిగిన జీతం పెరగదు. ఇంతకీ ఏంటంటే..
అదేనండి మీకు కూడా ఇప్పటికే అర్థం అయింది అనుకుంటాను. గృహిణి ఉద్యోగం. గృహిణి అంటే ఇంట్లో ఉండే ఇల్లాలు మాత్రమే కాదు. ఇంటి పనులు చేసే మహిళ అసలే కాదు ఇంటి బాధ్యతలను ఒక బాస్ లాగా ట్రీట్ చేసే ఉద్యోగం. ఈ ఉద్యోగం ఎంత చేసినా సరే అసలు డబ్బులే రావు. జీతం లేని సేవ చేస్తుంటుంది ఆ పడతి. కానీ ఏం లాభం నువ్వు ఏం చేశావు అని అంటారే కానీ, ప్రేమగా పలకరించే వారే కరువు అవుతున్నారు.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆమె చేసే పనులు ఎన్నో ఉంటాయి. కానీ ఆ పనులు చేయడం పెద్ద కష్టమా అంటారు? మొదట కేవలం ఇంటి పనులే. ఆ తర్వాత పిల్లలు పుట్టాక మరింత పెరుగుతుంది. వారు పాఠశాలకు వెళ్తుంటే మరింత పని పెరుగుతుంది. ఇలా పని పెరుగుతూ పోతుంది కానీ జీతం మాత్రం లభించదు. పైగా తిట్లు పెరుగుతుంటాయి. ఈ పనులు చేస్తున్న సమయంలో అలసి సొమ్మసిల్లిన కాస్త రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉండదు ఆ మహిళా బాస్ కు.
కాస్త ఆరోగ్యం సహకరించడం లేదని పడుకుంటే పని అలాగే ఉండిపోతుంది. లేచిన తర్వాత మళ్లీ ఆమెనే చేయాల్సిందే. అందుకే ఎంత నీరసంగా ఉన్నా కూడా పనులు చకచకా చేసిన తర్వాతనే రెస్ట్ తీసుకుంటుంది. ఈ జీతం లేని ఉద్యోగానికి జీతం ఇవ్వకున్నా.. కనీసం రెస్పెక్ట్ లేదా కాస్త ప్రేమ అయినా కురిపించండి. ఈ కాలంలో ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఉన్నారు. వీరు మరింత గ్రేట్. ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని ఉద్యోగానికి వెళ్లి వస్తుంటారు. వెళ్లే వరకు వచ్చిన తర్వాత పడుకునే వరకు వారి జీవితం మొత్తం పనే ఉంటుంది. కాస్త హెల్ప్ చేసే వారు కూడా ఉండరు. మీరు అర్థం చేసుకొని మీ ఇంట్లో ఉన్న మహిళకు సహాయం చేస్తే ధన్యవాదాలు..