Summer Tips: వామ్మో ఎండను ఇంట్లో నుంచి చూడాలి అంటే కూడా భయంగానే ఉంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల జనం అల్లాడిపోతున్నారు. బయటకు వెళ్లాలి అంటే వెన్నులో వణుకు వస్తుంది. ఎందుకంటే బయటకు వెళ్తే వడదెబ్బ బారిన పడే అవకాశం కూడా ఉంది. అందుకే ఎండకు వెళ్లాలంటే ఆలోచించాల్సిందే. ఇక 40 సంవత్సరాల పైబడిన వారు మాత్రం ఎండకు వెళ్లకూడదు అంటున్నారు నిపుణులు. మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సామాన్య ప్రజలు, ఉద్యోగాలు చేసే వారికి ఎండకు వెళ్లకుండా ఉండలేరు. ఉద్యోగాలకు, పనులకు వెళ్లాల్సిందే. అయితే ఎండకు వెళ్లేముందు ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు హైడ్రేట్ గా ఉండటానికి ప్రయత్నించండి. దీని వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు. కానీ కచ్చితంగా బయటకు వెళ్లేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ను మీతో తీసుకొని వెళ్లండి. దీనికి ఒక క్లాత్ ను చుట్టండి. నీరు చల్లగా ఉంటుంది. వాటర్ కూడా తాగాలి అనిపిస్తుంటుంది.
టీ, కాఫీలకు దూరంగా ఉండండి. వీటి వల్ల అనార్థాలే ఎక్కువ. వీటికి బదులు శీతలపానీయాలు, ఓఆర్ఎస్, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలను తీసుకోండి. మీ శరీరానికి ఇవి మేలు చేస్తాయి. ఎండలో మీరు పనిచేయాల్సి వస్తే చాలా నీరు తీసుకోండి. ఈ నీరులో ఉండే ఖనిజాలు మీ కరిగిపోయిన శక్తిని తిరిగి తీసుకొని వస్తాయి. శ్రమతో కూడిన పని చేస్తే మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. లేదంటే ఎండదెబ్బకు గురి అయ్యే అవకాశం ఉంటుంది.
లేత రంగు, వైట్ కలర్ బట్టలు వేసుకోవడం ఉత్తమం. కాటన్ దుస్తులు అయితే మరీ మంచిది. లూజుగా ఉండే బట్టలు వేసుకోండి. వీటి వల్ల గాలిని ఆశ్వాదించవచ్చు. సన్ స్క్రీన్ లోషన్ లను అప్లై చేయండి. వీటి వల్ల మీ చర్మం పాడవదు. ఎక్కువ సేపు జీర్ణంకానీ వస్తువులకు దూరంగా ఉంటూ మితమైన ఆహారం తీసుకోండి. మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండండి. మరి తెలుసుకున్నారు గా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు బయటకు వెళ్లండి. అయ్యో మరీ ముఖ్యంగా బయటకు వెళ్తే ఒక గొడుగు లేదంటే క్యాప్ అయినా పెట్టుకొని వెళ్లండి.