Health Tips: హిందూ సాంప్రదాయం ప్రవెంట్రుకలను పనులు చేయడం వల్ల కొందరికి మూఢనమ్మకాలుగా అనిపిస్తాయి. వీటిని పాటించేవారిని పురాతన మనసులు అని కీర్తిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి పెద్దలు వీటిని పాటించాలని భయంతో కూడిన నియమాన్ని ఏర్పాటు చేశారు. ఇవి ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటాయని నమ్మకంతోనే ఏర్పాటు చేశారని కొందరు చెబుతున్నారు. వీటిలో కొన్నిటిని ఉదాహరణకు తీసుకోవచ్చ. చేతికి ఉన్న గోర్లు కత్తిరించినవి.. తల వెంట్రుకలను ఎక్కడపడితే అక్కడ వేయకూడదు అని అంటారు. అలా వేయడం వల్ల అరిష్టం అని చెబుతూ ఉంటారు. అలా చెప్పేవారిని కొందరు చిన్నచూపు చూస్తుంటారు. అయితే వారు చెప్పడంలో అర్థం ఉందని కొందరు పండితులు వాదిస్తున్నారు. ఆ అర్థం ఏంటంటే?
ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని గోర్ల పెరుగుదలలో చూడొచ్చు. ఆ వ్యక్తికి గోర్లు స్వచ్ఛంగా ఉంటే అతని ఆరోగ్యం బాగుందని అనుకోవాలి. అంతేకాకుండా గోర్లు ఎండిపోవడమో లేక పాడైపోవడం కనిపిస్తే అతని శరీరంలో ఏదో లోపం ఉందని గుర్తించుకోవాలి. ఇలా గోర్లకు, వ్యక్తుల శరీరానికి అనేక రకాలుగా సంబంధాలు ఉంటాయి. అయితే గోర్లు కత్తరించినవి కూడా వాటిలో 24 గంటలపాటు జీవశక్తి ఉంటుందని ఆధ్యాత్మికవాదులు చెబుతున్నారు. ఇలా 24 గంటల పాటు జీవశక్తి కలిగిన గోర్లను ఒకరు కత్తిరించిన తర్వాత వాటిని ఇతరులు తొక్కడం కానీ.. దాటడం కానీ చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఉంటాయని చెబుతారు. అంటే ఆ గోర్లు కలిగిన వారి జీవశక్తి మరొకరి జీవశక్తితో ఘర్షణ పడి వారి శరీరంలో అనేక అనారోగ్యాలు వస్తాయని చెబుతున్నారు. ఇలా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఇతరుల గోర్లను తొక్కకూడదు అని పేర్కొంటున్నారు.
ఇలాగే తల వెంట్రుకలు కూడా ఒక వ్యక్తి నుంచి తీసిన తర్వాత ఇవి 24 గంటల పాటు జీవశక్తిని కలిగి ఉంటాయి. గొర్ల మాదిరిగానే తల వెంట్రుకలు కూడా ఇతరులు తొక్కడం లేదా చేతితో పట్టుకున్నా.. వారి ఆరోగ్యం బాగుండదని పేర్కొంటున్నారు.
Also Read: ఈ పనులు చేస్తున్నారా..? జాగ్రత్త..
అయితే ఇలాంటివి మూఢనమ్మకాలు అని కొందరు చెబుతూ ఉంటారు. ఒక చెట్టు నుంచి పువ్వులు కోసిన తర్వాత కొన్ని గంటల పాటు అది వాడిపోకుండా ఉంటుంది. అలాగే ఒక శరీరం నుంచి గోర్లు, వెంట్రుకలు తీసిన తర్వాత కూడా 24 గంటల పాటు ఇలా జీవశక్తిని కలిగి ఉంటాయి. కొంతమంది తంత్ర పూజలు చేసేవారు ఎక్కువగా గోర్లు, వెంట్రుకలను ఉపయోగించి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి ఎవరివో వారికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అందువల్ల ఇతరుల గోర్లను తొక్కకుండా జాగ్రత్త పడాలి. అయితే గోర్లు తీసేసిన వారు సైతం వాటిని ఎక్కడా పడితే అక్కడ కాకుండా చెత్త బుట్టలో వేసే విధంగా ప్రయత్నం చేయాలి.
ఇలా ప్రతి విషయాన్ని పెద్దలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నియమాలు ఏర్పాటు చేశారని.. వీటిని విస్మరించకుండా పాటించాలని.. అలా పాటిస్తేనే ఆరోగ్యంతో పాటు ఇల్లు సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు.