What men need in life: ప్రతి ఒక్కరూ తమ జీవితం బాగుండాలని కోరుకుంటూ ఉంటారు.. అయితే జీవితం బాగుండాలంటే ఏం చేయాలో వెతుకుతూ ఉంటారు. ఒక వ్యక్తి సంతృప్తిగా ఉండడానికి మనసు ప్రశాంతంగా ఉండాలి. తన పక్కనే ఉండే వ్యక్తులు తనతో ప్రేమగా ఉండాలి. ఈ రెండు ఉండడంవల్ల ఆ వ్యక్తి జీవితం బాగుంటుందని అనుకోవచ్చు. అయితే ఈ రెండు ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తాయి? వీటిని పొందడానికి ఏం చేయాలి? అనే విషయాలన్నీ చాలామందికి తెలియదు. అయితే ప్రతి వ్యక్తిని ఒక ప్రణాళిక ప్రకారంగా వేసుకుంటే ఈ రెండింటిని పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. మరి వీటిని పొందడానికి ఎప్పుడు? ఏం చేయాలో? ఇప్పుడు చూద్దాం..
మనిషి ఎదిగే క్రమంలో తనకు కొన్ని కొత్త లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు బాల్యం దశ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి కెరీర్లో ఎదగాలని అనుకుంటాడు. ఈ క్రమంలో 25 నుంచి 30 సంవత్సరాల లోపు తన జీవితం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే నేటి కాలంలో కొంతమంది ఈ సమయాన్ని వృధా చేస్తుంటారు. తమకున్న ఈ కాలంలో స్నేహితులతో తిరుగుతూ.. ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. కానీ తమ చదువుకు అనుగుణంగా 30 ఏళ్లలోపు తమ కెరీర్ పై ఒక ప్రణాళిక వేసుకుంటే 32 ఏళ్ల వరకు అయినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రేమను కోరుకునే జీవితం. అంటే ఈ సమయంలో ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని కోరుకునే వయసు. ఈ వయసులో కనుక తనకు అనుగుణంగా జీవిత భాగస్వామి వస్తే తనతో ప్రేమగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు 25 నుంచి 30 ఏళ్లలోపు కెరీర్ సక్సెస్ అయి.. 30 నుంచి 40 ఏళ్లలోపు జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటే.. 40 నుంచి 60 ఏళ్ల వరకు వారి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత వారి పిల్లలు మిగతా జీవితం గడిచిపోతుంది.
కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే 25 నుంచి 30 ఏళ్లలోపు కెరీర్ ప్లానింగ్ మరిచిపోయి జీవిత భాగస్వామి కోసం ఆరాటపడడం.. లేదా ఇతర వ్యాపకాలను ఏర్పాటు చేసుకొని సమయాన్ని వృధా చేయడం చేస్తున్నారు. ఇలా చేసి 30 నుంచి 40 ఏళ్లలోపు కెరియర్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే వారికి సమయం మించిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. ఫలితంగా కొన్ని రోజులపాటు అయిష్టంగానే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఇక ఉద్యోగం వచ్చి జీవిత భాగస్వామి కోసం వెతికే సమయం కూడా అయిపోతుంది. ఒకవేళ ఈ వయసులో పెళ్లి చేసుకున్న కూడా అనుకున్న జీవితాన్ని పొందలేదు.
ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ప్లానింగ్ కనుక ఉంటే వారి జీవితం పూర్తిగా అందంగా ఉంటుంది. అలా కాకుండా ఒక వయసులో చేయాల్సిన పని మరో వయసులో చేయడం వల్ల వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. అందువల్ల భవిష్యత్తును కాంక్షించే ప్రతి యువకుడు తమ జీవితానికి సరైన ప్లానింగ్ వేసుకోవాలి.