New Paper: మనిషికి న్యూస్ పేపర్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉందనేది కాదనలేని వాస్తవం. సోషల్ మీడియా వచ్చినా.. వీడియోలతో న్యూస్ లు వైరల్ అవుతున్న.. పొద్దున న్యూస్ పేపర్ చదివితేనే కొందరికి తృప్తి. వారి రోజు కూడా న్యూస్ పేపర్ తోనే మొదలు అవుతుంది. ఇంటర్నెట్ వచ్చినా కూడా వార్తలు వైరల్ అవుతున్నా న్యూస్ పేపర్ స్థానం మాత్రం మారడం లేదు. అయితే న్యూస్ పేపర్ చదువుతున్నా.. దాని పై ఉండే కొన్ని అంశాలను గమనించరు. అవేంటో ఓ సారి చూసేయండి…
మీకు న్యూస్ అంటే అర్థం తెలుసా. వార్త దీంట్లో కొత్తగా ఏముంది అనుకుంటున్నారా? నో నో.. ఇలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని అర్థం. ఇదొక్కటే కాదండోయ్ మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే.. న్యూస్ పేపర్ చివర్లో ఉండే చుక్కలు. న్యూస్ పేపర్ చివర్లో దాదాపు నాలుగు చుక్కలు ఉంటాయి. అది కూడా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క రంగులో ఉంటుంది. ఇలా ఉండటం వెనుక రహస్యం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే తెలుసుకోండి.
ఈ చుక్కలు న్యూస్ పేపర్ లో ప్రింట్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక సంకేతం అట. అప్పుడప్పుడు ఈ చుక్కలు సరిగ్గా ప్రింట్ అవవు. ప్రతి చుక్క వెనకాల నీడ మాదిరి మరొక చుక్క ప్రింట్ అవుతుంది. అంటే దీని అర్థం న్యూస్ పేపర్ లో ప్రింటింగ్ అలైన్మెంట్ సరిగా లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరిగ్గా గమనించి చూడండి. ఈ చుక్కలు ఒకటే ఆర్డర్ లో ఉంటాయి. ఈ ఆర్డర్ ను సీఎం వై కె సీక్వెన్స్ అంటారు.
సి- సియాన్ అంటే నీలి రంగు అని, ఎమ్ మెజెంటా అంటే గులాబీ రంగు అని, వై ఎల్లో అంటే పసుపు అని కె బ్లాక్ అంటే నలుపు అని అర్థం వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్డర్ లోనే కింద చుక్కలు ఉంటాయి. పైన చెప్పిన విధంగానే చుక్కలను బట్టే ప్రింట్ కూడా ఎలా ఉందో చెప్పవచ్చు.