Parents Know Before Marriage: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి జీవితాన్ని నందనవనం చేసుకోవాలంటే అది భార్యాభర్తల సమన్వయంతోనే సాధ్యం. పెళ్లికి ముందు జీవితం వేరు వివాహం తరువాత సాగే ప్రయాణం మరో రకంగా ఉంటుంది. పెళ్లికి ముందు అందరు తల్లిదండ్రుల చేతల్లో ఉంటారు. ఇక వివాహం జరిగిన వెంటనే భార్యతో సఖ్యత ఉంటుంది. అందుకే జీవితంలో ఎదిగేందుకు కొత్త జీవితాన్ని ప్రారంబించే ముందు సవాళ్లను అధిగమించాలి. కొత్త కాపురంలో కలతలు రాకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు పొద్దున్నే వచ్చి సాయంత్రం పోయేలా ఉండాలి. అందుకే జీవితంపై జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

మన ఇంటికి వచ్చే కోడలుకు కూడా మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పద్ధతులు వివరించాలి. అందుకు అనుగుణంగా నడుచుకునే విధంగా ఆమెను తయారు చేయాలి. అప్పుడే కుటుంబంలో ఎలాంటి మనస్పర్దలు లేకుండా అందరు ఐక్యంగా పనిచేసే అవకాశం ఉంటుంది. చిన్న పొరపాటు పెద్ద నష్టం కలగజేస్తుంది. అందుకే కుటుంబంలో ఎలాంటి దాపరికాలు లేకుండా మనసువిప్పి మాట్లాడుకోవాలి. దీంతో ఎలాంటి విబేదాలు రాకుండా ఉండే వీలుంటుంది. లేకపోతే కుటుంబం సమస్యల్లో చిక్కుకుని ఇబ్బందుల్లో పడుతుంది.
Also Read: Education System: 1998 డీఎస్సీ.. ఇప్పుడు టీచర్ ఉద్యోగం.. ఇదీ మన విద్యావ్యవస్థ తీరు
అత్తింటి వారు పుట్టింటి వారు తమ పిల్లల మనుగడ కోసం నిరంతరం ఆలోచించాలి. వారు తీసుకునే ఏ నిర్ణయమైనా అందరి సమ్మతంతోనే తీసుకునేందుకు తోడ్పడాలి. అప్పుడే ఎలాంటి తప్పులు చోటుచేసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి రెండు కుంటుంబాలు జాగ్రత్తలు తీసుకుంటూ గమనిస్తుండాలి. అప్పుడే వారి జీవితం సాఫీగా సాగేందుకు మనం కూడా సాయం చేసినట్లు అవుతుంది. దీనికి గాను ఎప్పటికప్పుడు దంపతుల అన్యోన్యతపై సలహాలు, సూచనలు ఇస్తే మంచిది.
జీవనగమనంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఆటుపోట్లు రాకుండా చూసుకోవాలి. కొడుకు, కోడలు పరస్పరం ప్రేమగా ఉండేందుకు వాతావరణం కల్పించాలి. వారికి ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదు. దీంతో వారి కాపురం మూడు కాలాలు పదిలంగా ఉండి పటిష్టంగా మారి మంచి దారిలో ముందుకు వెళ్లడం చూస్తాం. దీని కోసం రెండు కుటుంబాలు కూడా వారిలో ఆత్మస్థైర్యం నింపి జీవితంలో ఎదిగేందుకు మార్గాలు చూపించాలి.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ వార్నింగ్…?
[…] […]