Vastu Dosha In Home: మన ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలని కోరుకుంటాం. అలాగే చర్యలు తీసుకుంటాం. ప్రతి వస్తువు వాస్తు దిశగా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ఇలా మన జీవితంలో ఇల్లు మనకు మనకు అనేక అనుకూల ఫలితాలు ఇస్తుంది. లేకపోతే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. ఇలా వస్తు ప్రభావంతో మనకు కష్టాలు వస్తాయని తెలుసుకుని ప్రతి వస్తువు కూడా పక్కా వాస్తుకు ఉండాలని చూస్తాం. లేకపోతే మళ్లీ సరిచేసుకుంటాం. ఇలా వాస్తు తిప్పల నుంచి బయటపడతాం.
వాస్తు ప్రకారం చూస్తే ఇంట్లో భయం గొలిపే చిత్రాలు ఉంచకూడదు. ఉగ్ర రూపంలో ఉండే జంతువుల ఫొటోలు పెట్టుకోకూడదు. ఇలాంటివి పెట్టుకుంటే మనకు ప్రతికూలతలు ఏర్పడతాయి. ఇంట్లో పెద్దమనుషులు ఎద్దవారు నైరుతిలోనే పడుకోవాలి. ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే బయట పడేయాలి. పగిలిపోయిన అద్దం కూడా ఇంట్లో ఉంచుకోవడం సురక్షితం కాదు. అలా ఉంటే బయట పడేయడమే ఉత్తమం.
ఇంటి యజమాని ఎప్పుడు కూడా దక్షిణం వైపు తల పెట్టి పడుకోవాలి. లేకపోతే పడమర వైపు తల పెట్టి నిద్రించాలి. అంతేకాని తూర్పున, పడమర తల పెట్టుకోవడం మంచిది కాదు. ఇంట్లో ఆగిపోయిన గడియారం వంటివి ఉంటే వాటిని కూడా బయట పడేయాలి. ఎప్పుడు కూడా పిల్లర్ కింద కూర్చుని పని చేయకూడదు. అది కూడా అరిష్టమే.
ఇంట్లో వాష్ రూంలు ఉంటే వాటిని ఎప్పుడు కూడా మూసే ఉంచాలి. పొరపాటున తెరిస్తే మనకు నష్టం కలుగుతుంది. ఈశాన్యంలోనే నీటిని నిలువ చేయాలి. పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో వాడని మందులు ఉంటే కూడా బయట వేయాలి. ఇలా ఇంట్లో ఎలాంటి దుష్ర్పభావాలు రాకుండా ఉండాలంటే ఇలా వాస్తు నియమాలు పాటించడం మంచిది.