Music Director Raj Passed Away: టాలీవుడ్ లో మరో విషాదం. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతిచెందారు. రాజ్,కోటి ద్వయంలో ఒకరైన రాజ్ అకాల మరణం చెందారు. ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. టాలీవుడ్ లో రాజ్ కోటి సంగీత దర్శకత్వ ధ్వయం సుపరిచితం. 80, 90 దశకంలో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపారు. ఎన్నెన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించింది ఈ ధ్వయం. ఈ ధ్వయంలో రాజ్ అకాల మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రాజ్,కోటిది హిట్ ఫెయిర్. టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించారు. తమ సంగీత నేపథ్యంతో ఎన్నెన్నో చిత్రాలు హిట్ సాధించాయి. చిన్న సినిమాలుగా ప్రారంభమైన చిత్రాలు ఈ ధ్వయం సంగీత నేపథ్యంతో పెద్ద సినిమాల సరసన చేర్చిన సందర్భాలున్నాయి. సాలూరి రాజేశ్వరరావు సంగీత వారసుడిగా తెరపైకి వచ్చిన సంగీత దర్శకుడు కోటి. రాజ్ తో ఉన్న స్నేహంతో రాజ్, కోటిగా సుపరిచితులయ్యారు. రాజ్ అసలు పేరు సోమరాజు. దాదాపు 150కి పైగా చిత్రాలకు ఈ హిట్ ఫెయిర్ స్వరకల్పన చేశారు. 80,90 దశకంలో అగ్ర సంగీత దర్శకులుగా కొనసాగారు.
ఈ ఫెయిర్ స్వరపరచిన పాటలు, సినిమాలు అల్ మోస్ట్ హిట్టే. ముఠా మేస్త్రీ, బావా బావమరిది, గోవిందా గోవిందా, హలో బ్రదర్, అల్లుడా మజాకా, సీతారత్నంగారి అబ్బాయి లాంటి సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. 90వ దశకం మధ్యలో కోటితో కొన్ని విభేదాలు వచ్చి రాజ్ విడిపోయారు. రాజ్-కోటి నుంచి విడిపోయిన తర్వాత ఈయన సొంతంగా సిసింద్రి, రాముడొచ్చాడు లాంటి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. బాగానే రాణించారు. రాజ్ అకాల మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో ‘రాజ్’ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువచేశాయి. ఆయన అకాల మరణం నన్ను కలిచి వేసింది. ఆ కుటుంబానికి ప్రగాడ సానుభూతి అంటూ ట్విట్టర్ లో చిరంజీవి సంతాపం తెలిపారు.