https://oktelugu.com/

Astro Tips : బంగారు ఉంగరం ఏ వేలికి ధరిస్తే మంచిది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

ఆడవాళ్లు ఎక్కువగా బంగారం ధరిస్తూ ఉంటారు. సామాన్యులు సైతం చెవులకు, ముక్కుతో పాటు వేళ్లకు బంగారం ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. కొందరు తమ జాతక చక్రం బాగుండాలని ఐదు వేళ్లకు ఉంగరాలు ధరిస్తారు. మరికొందరు మధ్య వేలుకు.. ఇంకొందరు బొటన వేలుకు ఉంగరం ధరిస్తుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 3, 2024 / 10:48 AM IST

    Astro Tips

    Follow us on

    Astro Tips :  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషులు కొన్ని ఆభరణాలు ధరించడం వల్ల జీవితంలో సంతోషంగా ఉంటారు. అలాగే కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం శరీరంపై బంగారం ఉండడం వల్ల వేడిని అందించి అవయవాలు సక్రమంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చాలా మంది ఎక్కువగా జ్యోతిష్యాన్ని నమ్ముతూ చేతులకు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు అవగాహన లేకుండా ఏదో ఒక వేలుకు ఉండాలని ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. కానీ బంగారు ఆభరణాలు కొన్ని వేళ్లకు మాత్రమే ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వెండి ఉంగరం ధరించాల్సి వస్తే ఆ వేలుకు మాత్రమే ధరించాలని అంటున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

    శరీరంపై బంగారం ఉండడం వల్ల ఎంతో మంచిదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే బంగారంను లక్ష్మీతో పోలుస్తాం. అందువల్ల అమ్మవారి అనుగ్రహం కోసం చాలా మంది ఆడవాళ్లు ఎక్కువగా బంగారం ధరిస్తూ ఉంటారు. సామాన్యులు సైతం చెవులకు, ముక్కుతో పాటు వేళ్లకు బంగారం ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. కొందరు తమ జాతక చక్రం బాగుండాలని ఐదు వేళ్లకు ఉంగరాలు ధరిస్తారు. మరికొందరు మధ్య వేలుకు.. ఇంకొందరు బొటన వేలుకు ఉంగరం ధరిస్తుంటారు.

    కానీ ఇలా చేయడం వల్ల అరిష్టం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. బంగారు ఉంగరాన్ని కేవలం మూడో వేలుకు మాత్రమే ధరించాలని అంటున్నారు. పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం వల్ల మనిషికి ధైర్యాన్ని పెంచుతుంది. బంగారం ధరించడం వల్ల సూర్యునిశక్తి పెరుగుతుంది. బంగారం లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. బంగారంతో చేసిన ఉంగరం ధరించడం వల్ల సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వేలుకు ఉంగరం పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వేలుకు ఉన్న కండరాలు గుండెకు కనెక్ట్ అయి ఉంటాయి. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారని నమ్ముతారు.

    అయితే చాలా మంది అవగాహన లేకుండా ఉంగరాలు అన్నీ వేళ్లకు ధరిస్తూ ఉంటారు. మరికొందరు బొటన వేలుకు పెట్టుకుంటారు. కానీ అలా చేయడం వల్ల అరిష్టం అని అంటున్నారు. బంగారు ఉంగరం పొరపాటున కూడా మధ్యవేలికి పెడితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడి కొత్త సమస్యల్లో చిక్కుకుంటారు. ఏ పని చేసిన అడ్డంకులు ఏర్పడుతారు. సమాజంలో చిన్న చూపు ఉంటుంది. నిత్యం ప్రతికూల వాతావరణం ఉంటుంది. అందువల్ల బంగారం ఉంగరం మధ్యవేలుకు అస్సలు ధరించకూడదు. బొటన వేలుకు కూడా బంగారం ఉంగరం ధరించకూడదు. అయితే వెండి ఉంగరం ధరించాలనుకునేవారు ఈ వేలుకు పెట్టుకోవచ్చు. అలా ధరించడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు.

    శుభకార్యాల్లో బంగారు ఆభరణాలు ధరించడం వల్ల మనిషి రూపం మారిపోతుంది. ముఖ్యంగా మహిళలు ఈ సమయంలో బంగారు ఆభరణాలు వేసుకోవడం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే కొందరు మితిమీరి బంగారం ధరిస్తారు. ఇలా ధరించినా కూడా ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. పూజా సమయంలో ఎంతో కొంత బంగారం మెడలో ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.