coriander water benefits: మనం రోజు తీసుకునే ఆహారాలతో మనకు ఎన్నో లాభాలున్నాయి. వంటింట్లోనే మన ఆరోగ్యం మెరుగుపరిచే దినుసులు ఉన్నట్లు తెలిసినా వాటిని వాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. రోజు మనం వాడుకునే మసాలా దినుసుల్లో ధనియాలు ప్రముఖమైనవి. కూరలు రుచిగా ఉండాలంటే వాటి పొడిని వేసుకోవాలి. దీంతో భలే రుచిగా ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో ధనియాలు సాయపడతాయి. కొవ్వును కరిగిస్తాయి. చర్మం, జుట్టు సమస్యల నుంచి బయట పడేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, ఆందోళన, అలసట దూరం చేస్తాయి.

ఇందులో మైక్రో బయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ధనియాలు ప్రతి రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ధనియాల వాడకంతో అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. కొత్తిమీరలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. క్యాన్సర్, శ్వాస సమస్యలు దూరం చేస్తాయి. ధనియాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర సమస్యలు కూడా తొలగిపోతాయి. ధనియాల నీరు నొప్పి తగ్గిస్తాయి. కండరాలకు రిలాక్స్ కలిగేలా చేస్తాయి.
ధనియాల నీరు తాగడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. శరీరం వేడిగా ఉంటే రాత్రిళ్లు నిద్ర పట్టదు. నిద్ర లేమిని కూడా ఇవి దూరం చేస్తాయి. మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తాయి. గ్యాస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తున్నాయి. దీంతో ధనియాలను ఆహారంలో ఒక భాగంగా తీసుకోవడం ఉత్తమమే. ధనియాల్లో ఉండే ఐరన్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చికాకును తగ్గిస్తాయి. ధనియాలను నూనెతో కలిపి తీసుకుంటే జుట్టు రాలే సమస్య కూడా ఉండదు.

ధనియా నీటినిలో వేసి మరిగించాలి. నీరు సగానికి తగ్గినప్పుడు రెండు గ్లాసుల నీరు తీసుకుని ఒక గ్లాస్ కాగానే తాగాలి. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీరు తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు దూరం చేస్తాయి. ధనియాల వల్ల ఇన్ని లాభాలు ఉండటంతో వాటిని తీసుకోవడం ఉత్తమం. మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ధనియాల వల్ల మనకు కలిగే ప్రయోజనాల దృష్ట్యా మనం ధనియాలను ఆహారంలో చేర్చుకుని తీరాల్సిందే.