Gas: నిత్యావసర ధరల గురించి ఆలోచిస్తేనే గుండెల్లో గుబులు పుడుతుంది కదా. రోజు రోజుకు రేట్లు కొండెక్కుతున్నాయి.ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యుడికి బతకడం కూడా కష్టంగా అవుతుంది. పెరిగిపోతున్న ధరల వల్ల ఎంత పొదుపు చేసినా కుదరడం లేదు. ఇక ఈ గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో చెప్పాల్సిన అవసరం అసలు లేదు. వచ్చింది ఇది వర్షకాలం, రాబోయేది చలికాలం, ఈ రెండు సీజన్ లలో గ్యాస్ మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సీజన్లలో చాలా మంది వేడివేడిగా తినాలి అనుకుంటారు. వేడి నీళ్లు కూడా ఎక్కువ కావాల్సిందే. రెండు మూడు నెలలు రావాల్సిన గ్యాస్ కేవలం ఒక నెలనే వస్తుంటుంది. సో కొన్ని చిట్కాలను పాటిస్తే గ్యాస్ రెండు నెలలు వస్తుంది. మరి దీని కోసం ఏం చేయాలో తెలుసా? అయితే చూసేయండి.
నానబెట్టి ఉడికించాలి: పప్పులు, ధాన్యాలు ఉడకాలంటే చాలా సమయం కావాలి. ఇలాంటప్పుడు గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే బియ్యం, పప్పును వంటడానికి ఒక గంట ముందే కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. దీని వల్ల గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు.
గ్యాస్ బర్నర్: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేసుకోవాలి. మీరు గ్యాస్ బర్నర్ ను 3 నెలలకు ఒకసారైనా సర్వీసింగ్ చేసుకున్నా సరే గ్యాస్ సేవ్ అవుతుంది. గ్యాస్ బర్నర్ శుభ్రంగా ఉందా? లేదా అని తెలుసుకోవాడానికి మంటల రంగును చూస్తే చాలు ఈ విషయం అర్థం అవుతుంది. గ్యాస్ స్టవ్ మంట రంగు పసుపు, నారింజ లేదా ఎరుపు రంగులో ఉంటే మీ బర్నర్ శుభ్రంగా లేదని అర్థం చేసుకొని దాన్ని వెంటనే క్లీన్ చేయాలి. ఇలాంటప్పుడు వెంటనే సర్వీస్ చేయించుకుంటే మరింత మంచిది. దీనివల్ల మీ గ్యాస్ ఆదా అవుతుంది.
కుక్కర్ ఉపయోగించండి: వంటల్లో గిన్నెలకు బదులుగా కుక్కర్ ను ఉపయోగించడం వల్ల గ్యాస్ మరింత ఆదా అవుతుంది. ఎందుకంటే అన్నం, పప్పు, కూరగాయలు ఫాస్ట్ గా ఉడికుతాయి. కుక్కర్ లో ఉడకడానికి ఎక్కువ సమయం అసలు పట్టదు. వంట కూడా ఫాస్ట్ గా తయారు అవుతుంది.
వంట పాత్రల తడి: సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ కడిగిన పాత్రలను నేరుగా పొయ్యిమీద పెట్టి.. ఆ తడి పోయే వరకు గ్యాస్ మీద అలాగే ఉంచి ఆ తర్వాత ఆయిల్ పోస్తారు. ఈ తడి వల్ల గిన్నెలు తొందరగా వేడి అవవు. ఇందుకోసం గ్యాస్ కూడా ఎక్కువగానే అవసరం వస్తుంది. కాబట్టి కడిగిన పాత్రలను ఒక గుడ్డతో తుచిడి ఆరిన తర్వాత మాత్రమే వంట చేయడం వల్ల గ్యాస్ సేవ్ అవుతుంది. చిన్న చిట్కానే అయినా గ్యాస్ ను మాత్రం ఎక్కువగానే ఆదా చేస్తుంది.
ఈ తప్పు చేయవద్దు: ఫ్రిజ్ లోంచి తీసిన వెంటనే ఆహారాలను గ్యాస్ మీద పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఫ్రిజ్ లో ఉన్నవి చాలా చల్లగా ఉంటాయి. దీన్ని వేడి చేయడానికి గ్యాస్ ఎక్కువ అవసరం. కాబట్టి మీరు ఏదైనా ఫ్రిజ్ లోంచి తీస్తే వెంటనే పొయ్యి మీద పెట్టకుండా నార్మల్ అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత వేడి చేయండి.
ఎక్కువ మంట: కొంతమంది ప్రతిదీ తక్కువ మంట మీద వండుతారు. వర్షాకాలంలో, చలికాలంలో ఇలా వంట చేయడం వల్ల గ్యాస్ ఎక్కువ అవసరం వస్తుంది. ఈ సీజన్ లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల.. వంట చేయడానికి చాలా టైం అవసరం. సో గ్యాస్ వృధా అవుతుంది కాబట్టి ఇలా చేయవద్దు.