Water Bottle cap color : మార్కెట్లో ప్రతి వస్తువు కల్తీమయం అయిపోతుంది. మొన్నటివరకు నీరు మాత్రమే
స్వచ్ఛమైనదిగా భావించారు. కానీ ఇప్పుడు నీరు కూడా కాలుష్యంగా మారుతుంది. దీంతో చాలామంది పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు స్వచ్ఛమైన నీటిని తీసుకుంటూ ఉంటారు. కానీ బయటకు వెళ్ళినప్పుడు స్వచ్ఛమైన నీరు దొరికే అవకాశం లేదు. దీంతో మినరల్ వాటర్ను కొనుగోలు చేస్తూ ఉంటారు. మినరల్ వాటర్ లోను కొన్ని రకాల నాణ్యమైన కంపెనీలకు చెందినవి అయితేనే బెటర్ అని కొందరు సూచిస్తున్నారు. నార్మల్ కంపెనీల నీరు తాగితే అనారోగ్యానికి గురై అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్లో మినరల్ వాటర్ కొనే సమయంలో కొన్ని వాటర్ బాటిల్స్ మూతలు రకరకాల రంగుల్లో కనిపిస్తాయి. ఈ రంగుల్లో కనిపించడానికి ప్రత్యేక అర్థం ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. అసలు వాటర్ బాటిల్ పై ఉన్న మూత డిఫరెంట్ రంగులో ఎందుకు ఉంటుందో తెలుసా?
Also Read : ఇంట్లో ఉండే ఈ వస్తువులపై టాయిలెట్ లో కంటే ఎక్కువగా క్రిములు.. ప్రాణాలే పోతాయి!
సాధారణంగా బయట కిరాణం షాపుల్లో లేదా షాపింగ్ మాల్స్ లో ఎక్కువగా కనిపించే వాటర్ బాటిల్స్ మూతలు నీలం రంగులో ఉంటాయి. ఇలా నీలం రంగు ఉండడానికి ప్రత్యేక అర్థం ఉంది. ఈ వాటర్ మినరల్ చేసినవి అని అర్థం. అంటే సాధారణ నీరును శుద్ధి చేసి మినరల్ గా మార్చాలని తెలుసుకోవాలి.
కొన్ని వాటర్ బాటిల్స్ మూతలు గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇలా గ్రీన్ కలర్ లో ఉండడానికి కూడా ఓ అర్థం ఉంది. ఇవి ఫ్లేవర్డ్ వాటర్ అని అర్థం. ఈ నీరు టెస్టు వేరుగా ఉంటుంది. కొంతమంది ప్రత్యేకంగా వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ లో మాత్రమే లభిస్తాయి.
వాటర్ బాటిల్ పై నలుపు రంగు మూత ఉండేవి చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని ధనవంతులు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ నీరు తాగడం వల్ల కడుపులో ఉన్న ఎసిడిటీ తగ్గిస్తుందని అంటారు. ఇవి బయట ఎక్కువగా దొరకవు. ప్రత్యేకంగా తెప్పించుకోవాల్సి ఉంటుంది.
కొన్ని రకాల వాటర్ బాటిల్స్ పై మూతలు వైట్ కలర్ లో ఉంటాయి. ఇవి ప్యూరిఫై వాటర్ అని అర్థం చేసుకోవాలి. ఇవి కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని కొందరు ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు. ఇవి ఎక్కువగా షాపింగ్ మాల్స్ లోనే కనిపిస్తాయి.
ఇలా వాటర్ బాటిల్స్ పై ఉన్న మూతల రంగులను బట్టి ఆ నీరు ఎలాంటిదో తెలుసుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం మినరల్ వాటర్స్ నే తాగుతూ ఉంటారు. వీటి ధర సాధారణంగా ఉంటుంది. మిగతా వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉండడం వల్ల వాటిని కొనుగోలు చేయరు. అంతేకాకుండా నీలం రంగు కాకుండా మిగతా వాటర్ బాటిల్స్ ధర కొన్ని ప్రదేశాల్లో మాత్రమే విక్రయిస్తూ ఉంటారు. ఏ వాటర్ బాటిల్ కొనుగోలు చేసిన కంపెనీని బట్టి కొనుగోలు చేయాలని అంటున్నారు.