Wake Up : సాధారణంగా తొందరగా నిద్రపోయి సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ టైంలో నిద్ర గడియారని పాటించడం వల్ల శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుందని చెబుతూ వస్తున్నారు. కానీ తాజాగా లండన్ కు చెందిన కొందరు పరిశోధనలు చేసిన పరిశోధనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆలస్యంగా నిద్రపోయిన వారు.. ఆలస్యంగా నిద్రలేస్తే వారిలో మేదస్సు ఎక్కువగా ఉందని తేల్చారు. కానీ అదేలా సాధ్యమని కొందరు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఎన్నో రకాలుగా నష్టాలు ఉన్నాయి. అంతేకాకుండా సమయం కూడా తొందరగా గడిచి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికాకుండా ఉంటాయి. మరి ఈ పరిశోధనలు ఏం తేల్చాయి? ఎలా చెప్పగలుగుతున్నాయి?
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కు చెందిన సైకాలజిస్ట్ సంతోషి కణజావా బృందం ఆలస్యంగా నిద్రలేచే వారిపై పరిశోధనలు చేసింది. వీరు తమ నివేదికలను ఇటీవల బయటపెట్టారు. ఈ నివేదికలు ‘ the general personality and individual difference’ లో పబ్లిష్ అయ్యాయి. దీని ప్రకారం ఆలస్యంగా నిద్రలేస్తున్న వారిలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే దీనికి పరిశోధకులు కొన్ని కారణాలు చెప్పారు. ఎందుకంటే సాధారణంగా ఆలస్యంగా నిద్రించి ఆలస్యంగా లేచే వారిలో ఎక్కువగా సమస్యలు ఉంటాయి. కానీ వీరు చెబుతున్న ప్రకారం ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేచే వారిలో.. ఎక్కువగా ఐక్య ఉన్నట్టు తెలిపారు.
Also Read : ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటే ఎంత మంచిదో తెలుసా?
ఈ అధ్యయన నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. ఎక్కువ మేధస్సు కలిగిన వారు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతారు. మీరు తమ పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీంతో వీరిలో ఎక్కువగా తెలివి ఉంటుందని గుర్తించారు. అయితే తొందరగా నిద్రించి తొందరగా లేచే వారి కంటే ఆలస్యంగా నిద్రలేచే వారిలోనే ఎక్కువగా ఐక్య ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వారి మెదడు ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకున్నారు. రాత్రులు ఎక్కువగా మెలకువ ఉండడంతో కాస్త ఒత్తిడి పెరిగిన పనులు పూర్తి చేయడంలో మాత్రం వారే ముందుంటారని చెప్పారు.
అయితే పెద్దలు చెపుతున్న ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల వారిలో ఎనర్జీ ఎక్కువగా ఉండి ఉత్సాహంగా పనిచేయగలుగుతారని చెప్పారు. కానీ రాత్రిళ్ళు ఎక్కువగా మెలకువతో ఉండి ఉదయం ఆలస్యంగా వేసేవారు ఏదైనా పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా అపరిమిత శక్తులతో కూడిన వాటిని పూర్తి చేసేందుకు వీరిలో మేధస్సు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా వీరిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం చేయడంలో ఉత్సాహం చూపిస్తారు.
అయితే ఇది అందరికీ వర్తించదని కొందరు పేర్కొంటున్నారు. రాత్రులు ఏదైనా పని కోసం మెలకువ ఉంటే పర్వాలేదు.. అలా కాకుండా సోషల్ మీడియా లేదా ఏదైనా కాలక్షేపంతో గడిపే వారు నిద్రను పాడు చేసుకోవడమే అని అంటున్నారు. అలా చేయడం వల్ల ఎటువంటి మేధస్సు రాదని చెబుతున్నారు.
Also Read : ఉదయాన్నే నిద్ర లేస్తే ఎన్ని లాభాలో తెలుసా?