RBI: ఆర్బిఐ అందిస్తున్న ఈ సేవింగ్స్ బాండ్ లో 8.05% వడ్డీ రేటు తో సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా చెప్పవచ్చు. దీనిని మీరు కనీసం గా వెయ్యి రూపాయలు పెట్టుబడితో ప్రారంభించవచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఆర్బిఐ అందిస్తున్న సేవింగ్స్ బాండ్లలో స్టాప్ హోల్డింగ్ ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. దీంట్లో మీకు స్థిరమైన ఆదాయం మరియు పెరుగుతున్న వడ్డీరేట్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో లో పెరుగుతున్న ఖర్చులు మరియు మారుతున్న జీవనశైలి ఆధారంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా పెట్టుబడులు పెట్టుకోవాలి. పెట్టుబడిని కూడా మీ పోర్టుఫోలియోలో చేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుతం వివిధ రకాల పెట్టుబడి ఎంపికలు ప్రజల కోసం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలిక ఆర్థిక రక్షాలను చేరుకోవడానికి మీరు సరైన పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవడం చాలా కీలకం.
2020 నాటి ఫ్లోటింగ్ రేటు సేవింగ్స్ బాండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి పథకంగా చెప్పవచ్చు. ఈ పథకం మీరు ఆర్థిక వనరులను భద్రపరచుకోవడానికి మరియు మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్న వడ్డీరేట్ల నుంచి ప్రయోజనం పొందడానికి చాలా బాగా సహాయపడుతుంది. సాధారణంగా చెప్పాలంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది. కానీ డిజైర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ లో మీరు ప్రస్తుతం మార్కెట్లో వడ్డీ రేట్లకు అనుగుణంగా వడ్డీ చెల్లింపులను పొందవచ్చు. ఈ బాండ్ల పై వచ్చే వడ్డీ కూడా మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెరుగుతుంది.
ప్రస్తుతం ఆర్.బి.ఐ ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లపై 8.05% వడ్డీని అందిస్తున్నాయి. బ్యాంకు లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ల కంటే ఆర్బిఐ అందిస్తున్న ఈ పథకంలో మీరు ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో మీరు అదనంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు పై 35 బేసిస్ పాయింట్లు వడ్డీని ఎక్కువగా పొందవచ్చు. అలాగే విశేషమేంటంటే ఎన్ఎస్సి వడ్డీ రేటు పెరిగినప్పుడు ఆర్బిఐ బాండ్స్ వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలంటే మీరు కచ్చితంగా భారతీయ నివాసి అయి ఉండాలి.