Benefits Of Wake Up Early: మనలోచాలా మంది ఉదయాన్నే నిద్ర లేవరు. పొద్దెక్కితే కానీ పక్క నుంచి కిందికి దిగరు. దీంతో ఎన్నో అనర్థాలున్నాయని తెలిసినా ఆ అలవాటు మార్చుకోవడం లేదు. పొద్దున్నే లేవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే లేస్తే పనులు సులువుగా పూర్తవుతాయి. అదే ఆలస్యమైతే పనులు ఓ పట్టాన పూర్తి కావు. ఉదయం పనులు వేగంగా జరగాలంటే తొందరగా మేల్కొంటేనే కానీ సాధ్యం కాదు. దీంతో ఉదయం పూట లేవడమే అన్నింటికి పరిష్కారం.

ఉదయం శబ్ధ కాలుష్యం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏ పని చేసినా తొందరగా పూర్తవుతుంది. పొద్దన్నే లేచి టీ, కాఫీలు తాగుతూ సమయం వృథా చేయకుండా పనులు చేసుకోవడమే ఉత్తమం. వేకువనే లేస్తే వ్యాయామం, ధ్యానం, యోగా లాంటివి చేసుకుంటే శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఉదయాన్నే నిద్ర లేస్తే ఉత్సాహం పెరుగుతుంది. రోజంతా అదే హుషారు ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయి.
వేకువనే లేస్తే సమయం ఎంతో ఆదా అవుతుంది. సమయం అందుబాటులో ఉండటంతో కుటుంబసభ్యులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి వీలు పడుతుంది. చిన్న పిల్లలతో ఆడుకునే సమయం కూడా దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నిద్ర నుంచి మేల్కుంటే కలిగే లాభాల దృష్ట్యా అలవాటు మార్చుకుంటే మంచిది. రోజువారీ పనులు కూడా త్వరగా చేసుకుని హాయిగా ఉండొచ్చు. దీని కోసం మనం ఎంత తొందరగా నిద్ర లేస్తే అంత ప్రయోజనం కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉదయం నిద్ర లేస్తే మన ఇష్టమైన ఆహారాలు కూడా వండుకోవచ్చు. మన మనసుకు నచ్చిన వంటకాలు తయారుచేసుకుని మనసారా తినొచ్చు. రాత్రి తొందరగా నిద్రపోతే ఉదయం త్వరగా నిద్ర లేవచ్చు. ఉదయాన్నే లేస్తే మంచి ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయం పూట చదువుకుంటే చదువు ఒంటపడుతుంది. చదువు సాగడంలో ఎలాంటి అవాంతరాలు ఉండవు. ఉదయం నిద్ర లేచి మన జీవన గమనాన్ని మార్చుకోవచ్చు. దీనికి అందరు వేకువనే నిద్ర లేచేందుకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.