Chanakya Niti
Chanakya Niti : చాణక్యుడు మనుషుల జీవితాల కు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేశాడు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో నుంచి.. ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి విధంగా ప్రవర్తించాలో వరకు చాణక్యుడు పేర్కొన్నాడు. అయితే కొంతమంది చాణక్యనీతి ఫాలో అవుతూ తమ జీవితాలను సార్ధకం చేసుకుంటున్నారు. అయితే చాణక్య నీతికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియాల్సి ఉంది. ముఖ్యంగా నేటి కాలంలో పుస్తకాలు ఎక్కువగా చదవని వారు చాణక్య నీతి గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నారు. అయితే చాణక్య నీతిలోని ఓ విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. చాణక్య నీతి ప్రకారం అదృష్టవంతులకు ఈ లక్షణాలు ఉంటాయి. అవేంటంటే?
జీవిత భాగస్వామి:
అదృష్టవంతులకు జీవిత భాగస్వామి మంచి లక్షణాలు ఉన్న వారు దొరుకుతారు. మీరు తమ భర్తను అర్థం చేసుకుంటారు. భర్త చేసే ప్రతి పనిలో తోడై ఉంటారు. అంతేకాకుండా జీవిత భాగస్వామి తన ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని పనులు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ పిల్లలు వస్తే వారిని కూడా బాగా చూసుకునే లక్షణం ఉంటుంది. ఇంట్లో ఏ సమస్య వచ్చిన జీవిత భాగస్వామి తోడై ఉంటుంది. ఎదుటివారితో సమస్యలు వచ్చినప్పుడు వారి నుంచి ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ.. ఆనందంగా ఉంచే భాగస్వామి దొరకడం అదృష్టమని చాణిక్యనీతి తెలుపుతుంది.
Also Read : భార్యలో ఈ లక్షణాలు ఉంటే.. భర్త అదృష్టవంతుడే..
దానధర్మాలు:
కొందరికి దానం చేయాలంటే అసలు మనసు ఇష్టం ఉండదు. మరికొందరు మాత్రం ఎడాపెడా దానం చేస్తూ ఉంటారు. దానం చేయడం ద్వారా ఎంతో పుణ్యఫలం వస్తుంది. కానీ దానం చేయడానికి చాలామంది ముందుకు రారు. అంటే దానం చేస్తున్నారంటే వారు అదృష్టవంతులు అని చాణిక్య నీతి తెలుపుతుంది. కొందరు దానం చేయడం వల్ల ధనం కరిగిపోతుందని అనుకుంటారు. కానీ దాన ధర్మాల వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుంది. వీటితో జీవితం ఆనందమయంగా మారుతుంది. అందువల్ల దానధర్మాలు చేసే గుణం ఉన్నవారు అదృష్టవంతులు అని చాణిక్యనీతి తెలుపుతుంది.
ఆరోగ్యం:
నేటి కాలంలో ధనం, ధాన్యం కన్నా మంచి ఆరోగ్యం ఉండడమే గగనంగా మారింది. వాతావరణ కలుషితంతో పాటు రకరకాల ఆహార పదార్థాల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో మంచి ఆరోగ్యానికి ఉండలేకపోతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే వారు అదృష్టవంతులు అని చాణిక్యనీతి తెలుపుతుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వారు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా వారు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా డబ్బు ఖర్చు చేయని అవసరం లేదు. అందువల్ల మంచి ఆరోగ్యం ఉన్నవారు అదృష్టవంతుడు అని చాణిక్యనీతి తెలుపుతుంది.
కష్టపడి పనిచేయడం:
కొందరికి డబ్బు ఏ పని చేయకుండా వస్తుంది. కానీ ఇలాంటివారు అదృష్టవంతుడు అని అనుకుంటారు. అలాకాకుండా కష్టపడి పనిచేయడం ద్వారా వచ్చిన డబ్బుతో జీవించేవారు అదృష్టవంతులు అని చాణిక్య నీతి తెలుపుతుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసిన డబ్బు ఎన్నటికీ కరిగిపోదు. అందువల్ల కష్టపడి పనిచేసే గుణం ఉన్నవారు అదృష్టవంతులు అని చాణిక్యనీతి తెలుపుతుంది.
Also Read : ఇలాంటి వాళ్లను కష్టపడితే.. దరిద్రం తాండవిస్తుంది..
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: Chanakya niti characteristics of lucky people