Vizag Steel Plant Jobs: వైజాస్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాలలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 206 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్ అభ్యర్థులతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. సంబంధిత బ్రాంచ్ లో బీఈ లేదా బీటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం మధ్యలో ఇంజనీరింగ్ పాసైన ఉద్యోగులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
Also Read: జనసేన-తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయా? చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 9,000 రూపాయలు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 33 ఉండగా సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 2019 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం వరకు ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 8,000 రూపాయలు వేతనంగా లభించనుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.vizagsteel.com/index.asp వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా మార్చి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
Also Read: చివరకు క్రిస్టియన్లకూ ఏపీలో అసంతృప్తియేనా?